నా కల.. నా ఆశ.
వాస్తవం..
బకింగ్ హామ్ కాలువ నా చిన్నతనంలో ఎంతో అందంగా, హుందాగా సాగుతూ.. ఎన్నో పంట పొలాలకి నీరు అందిచేది.
మా అమ్మా వాళ్ల చిన్నతనంలో, రాజమండ్రీ నుంచి చెన్నపట్నం వరకూ
ఆ కాలువలో గూటిపడవలో(అవును.. ముత్యాలముగ్గులో మీరు చూసిందే..) ప్రయాణం చేసేవారు. వారం రోజులు పట్టేదిట. అయితేనేం.. ఎంతో సరదాగా ఆనందంగా.. మధ్యలో వచ్చే ఊళ్లల్లో భోజనాలు చేస్తూ.. పాచలు పద్యాలు పాడుగుంటూ వెళ్లే వాళ్లం అని చెప్పేది అమ్మ.
ఏలూరులో, బెజవాడలో.. ఇంకా అన్ని ఊళ్లలో..కాలువ చుట్టూ ఇళ్లు, రోడ్లు.. నయనానందకరమే..
కాలక్రమేణా ఆ కాలువ కనుమరుగైపోయి.. శిధిలాలుగా మిగిలింది. అన్ని ఊర్లలో.. పెంటలు వేసుకోడానికి, డెక్కలు పెరగడానికి, వ్యర్ధరసాయనాలు, విద్యుత్ కర్మాగారంలోంచి వచ్చే బూడిద, ఇంకా వివిధ చముర్లు కలపడానికి ఉపయోగపడుతోంది.
మొన్నామధ్య ఏలూర్లో చూశా.. పాలిథీన్ కవర్లు, రకరకాల పెంటలు.. అడక్కండి. ఏడుపొచ్చింది.
కల..
ఆ కాలువ పునరుద్ధరింపబడింది. గలగలా పారే నీరు.. పంటపొలాలని తడుపుతోంది.
ఆ నీటిమీద సూరీడు గర్వంగా చూస్తున్నాడు.
రోడ్లమీద లారీల వత్తిడి తగ్గడానికి, కాలువ ద్వారా సరుకుల రవాణా జరుగురోంది. రేవుల దగ్గర ఆగినప్పుడు సరంగులు మారుతూ పరాచికాలు ఆడుతున్నారు.
అంతేనా..
ఆశ..
ఆ కాలువ మీద సౌరశక్తి గ్రహించే ఫలకాలు.. మెరుపులు చిందిస్తూ..
ఆ ఫలకాలు కాలువలో నీటిని ఆవిరి ద్వారా ఇగిరిపోకుండా కాపాడుతాయి..
సౌరశక్తిని విద్యుత్ శక్తి కింద మారుస్తాయి.. ( మన దేశంలోనే ఒక రాష్‌ట్రంలో విజయంతంగా మారుస్తున్నాయి..).. వాతావరణ కాలుష్యం తగ్గింది.. కాలువ ఒడ్డున పర్యాటక కేంద్రాలు వెలిశాయి.
ప్రజలలో శుభ్రత పై అవగాహన వచ్చింది.
నా కల నిజమయ్యేనా..
నా ఆశ తీరేనా..
బకింగ్ హామ్ కాలువ..
నాడు, నేడు..

1 వ్యాఖ్యలు:
Neeru , Kaluvalu teliyani rayalaseema daanini. Ila chadivite Ento baga anipistundi!
Post a Comment