Wednesday, August 13, 2014

Posted by Mantha Bhanumathi on Wednesday, August 13, 2014 with No comments
ఆగస్ట్ పదకొండు, ౨౦౧౪- 
నిలువు ఊచల కటకటాల వరండా లో చాప మీద కూర్చుని, వ్యాసపీఠం మీద కాగితాల బొత్తి పెట్టుకుని.. (అది కూడా అక్కర్లేదని పడేసిన, ఒక వైపు మా ప్లీడరు బాబాయి టైపు కాగితాలు) పరపరా రాసేస్తున్నాను. ఇంతకీ ఈ వరండా ఉన్న ఇంట్లో మేమెప్పుడూ లేము. అది పేరూరులో మా బావగారి ఇంట్లో ఉన్న ఆకుపచ్చని పైంట్ వేసిన కటకటాల వరండా.
వీధిలోంచి మా ప్రొఫెసర్ గారు వాకింగ్ కి వెళ్తున్నారు. గుమ్మంలో ఆగి, "ఏం రాస్తున్నారు?" అని అడిగారు.
“రెండు రాస్తున్నా సార్! ఒకటి సైన్స్ మాగజీన్ కి ‘డియన్ యే’ మీద అర్టికిల్, ఇంకొకటి పత్రికల వాళ్లు కథల మీద రాయమన్న సమీక్ష..” తడబడుతూ లేచి అన్నాను.
“మొదటిది ఓ.కే. రెండోది ఎందుకు చెప్పండి.. సైన్స్ మీద.. కెమిస్ట్రీ మీద ఆర్టికిల్స్ రాయండి.” బైటే నిలబడి ఆర్డరేశారు.
అప్పుడు నా మట్టి బుర్రకి తట్టింది, బైటే నిలబెట్టేశానని.
“లోపలికి రండి సార్. టీ తాగి వెళ్దురు..”
“టీ వద్దు. ఏవీ కాగితాలు? ఇదేంటి ఇక్కడ ఫార్ములా తప్పేశారు. ఇక్కడేమో.. యస్. యన్. జి (సెంటెన్స్ నాట్ గుడ్..)..” అలా అలవోకగా పదో పన్నెండో కరెక్షన్స్ చేసి, “మీరే ఇంటికి రండి కాఫీ తాగి ఈ ఆర్టికిల్ డిస్కుజ్ చేద్దాం..” అంటూ గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
మళ్ళీ నా యమ్.బి కి తట్టలే ప్రొఫెసర్ గారికి కాఫీ ఇష్టమని. వెళ్ళిపోయాక ఎంత చింతిస్తే ఏం లాభం?
ఇంతకీ కథలు.. విమర్శ సరే.. ఇప్పుడు ఆ డియన్ యే ఎందుకుట? నుదుటి మీద కొట్టుకుని ఆలోచించా.. 'మెలుకువ వచ్చాక..'
మా క్లాస్ మేట్, దోస్త్.. విజయ్ కి (ప్రొఫెసర్ చల్లా విజయకుమార్, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్..) మొన్ననే ప్రతిష్ఠాత్మకమైన NSF (National science foundation) avaarD vachchiMdi. (అదివరకు బోలెడు అవార్డ్ లు వచ్చయనుకోండి..) అందులో డియన్ యే చాప (ఫ్లోర్) మీద ప్రోటీన్లని అతికించి, వాటిని సౌరశక్తి పీల్చి దాచిపెట్టే పరికరంగా తయారు చెయ్యడానికి ప్రయోగాలు చేస్తున్నాడని. అవి తయారైతే.. ప్రకృతిలో కలిసిపోయే బేటరీలు రెడీ.
చూశావా విజయ్.. నీ అవార్డ్ న్యూస్ చదివాక ఎలా కలలు కంటున్నానో! నీ ప్రయోగాలు తప్పక మంచి ఫలితాల్నిస్తాయి.. ఎందుకంటే నాకీ కల తెల్లవాఝామున వచ్చింది. నువ్వు అదేదో త్వరగా చేసేస్తే.. నేను దాని మీద తెలుగులో ఆర్టికిల్ రాసేసి, ప్రొఫెసర్ చేత దిద్దించేస్తా.

Related Posts:

  •                                                  Why this cell phone.. cell phone?    Ju… Read More
  • చాలా రోజుల తరువాత.. ఈ నవంబర్ లో లక్షద్వీపాలు, కేరళ టూర్ వెళ్లాం. ఆ విశేషాలు.. మా సముద్రా విహార యాత్ర-- మొదటి రోజు. మొత్తం ఆరు జంటలు. అందరూ స్వీట్ సెవెన్టీస్ వాళ్లే. భాను- రావ్, విజయా-కుమార్(మా సమ్మందీలు), షానజ్-షరీ… Read More
  • నేల-బండ 31-3-2016- శుభోదయం. 2. మీరు ఎప్పుడైనా ‘నేల-బండ’ ఆట ఆడారా? ఒకో సారి ఒకో ఆట పట్టుకుని వదలకుండా ఆడే వాళ్లం.  నాకు పదేళ్లప్పుడు..   మేం అరండేల్ పేట, ఒకటో అడ్డరోడ్డు, పదో లైన్లో పాటిబండ ప్రసాదరావుగారింట్లో ఉం… Read More
  • తొక్కుడు బిళ్ల 30—3—2016.     1..తొక్కుడు బిళ్లాట:- గుర్తుందా? అప్పుడు నాకు ఏడో ఎనిమిదో ఏళ్లుంటాయి.      ఆట చివర్లో కళ్లు మూసుకుని గళ్లు దాటాలి. అలా మూసుకున్నపుడు మా వరాలు గబగబా గీత తుడిప… Read More
  • పున్నమివెన్నెల-చల్లని గాలి 3. 2-4-2016. పున్నమి వెన్నెల-చల్లగాలి: ఈ మధ్యని వేడి చాలా ఎక్కువైంది కదా! AC వెయ్యక తప్పట్లేదు. పొద్దున్న లేచే సరికి ఒళ్లంతా పొడి బారి పోయి, తలంతా దిమ్ము.. గదిలోంచి బైటికి రాగానే వేడి. ఏంటో.. ఈ బందిఖానా.. 30 సంవత్సరాల … Read More

0 వ్యాఖ్యలు: