Monday, April 23, 2012

బ్లాగ్ మిత్రులతో కాసేపు

Posted by Mantha Bhanumathi on Monday, April 23, 2012 with 3 comments
నిన్న  చాలా మంచి రోజు.
మొదటిసారి బ్లాగ్ మిత్రులు కొందరిని కలిశాను. కానీ అలా అనిపించలేదు.. అదే విచిత్రం. ఎప్పట్నుంచో
తెలిసిన  వాళ్ల   లాగ  కలిసిపోయి కబుర్లు చెప్పుకున్నాము, ఆటలాడుకున్నాము. అదే బ్లాగు మహత్యం మరి.
మాలా కుమార్   ఎప్పట్నుంచో తెలుసు, కానీ  ఇంచుమించు ఇరవై ఏళ్ల  తరువాత  ఇప్పుడు కలిసి సంగతులు కలబోసుకున్నాం.
జ్ఞాన ప్రసూనగారు, లక్శ్మి గారు, ఉమాదేవి, వరూధిని, సుజి, (అందరి పేర్లూ గుర్తు లేవు, క్షమించాలి.. ఇంకొక్కసారి కలుస్తే..), జ్యోతి వలభోజు, మాలా కుమార్   సరే సరి..
అక్కడ్నుంచి, ఉమాదేవిగారు వారింటికి తీసుకెళ్లి చల్లని పానీయం ఇచ్చి ఆదరించారు.
అన్నట్లు జ్యోతి బ్లాగ్‌లో ఫొటోలు ఉంటాయి కూడా.. నాకు పంపారు. చాలా బాగున్నాయి.
అదండీ సంగతి.
భానుమతి.

3 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి said...

ఎంతో ఓపికగా వచ్చారు.చాలా సంతోషం.

జయ said...

చాలా సంతోషమండి. మీ అందరికీ అభినందనలు.

మాలా కుమార్ said...

దాదాపు 20 సంవత్సరాల తరువాత మిమ్మలిని కలవటం చాలా ఆనందం గా అనిపించిందండి . శ్రమ తీసుకొని మా ఇంటికి వచ్చినందుకు థాంక్స్ అండి .