Monday, April 23, 2012

బ్లాగ్ మిత్రులతో కాసేపు

Posted by Mantha Bhanumathi on Monday, April 23, 2012 with 3 comments
నిన్న  చాలా మంచి రోజు.
మొదటిసారి బ్లాగ్ మిత్రులు కొందరిని కలిశాను. కానీ అలా అనిపించలేదు.. అదే విచిత్రం. ఎప్పట్నుంచో
తెలిసిన  వాళ్ల   లాగ  కలిసిపోయి కబుర్లు చెప్పుకున్నాము, ఆటలాడుకున్నాము. అదే బ్లాగు మహత్యం మరి.
మాలా కుమార్   ఎప్పట్నుంచో తెలుసు, కానీ  ఇంచుమించు ఇరవై ఏళ్ల  తరువాత  ఇప్పుడు కలిసి సంగతులు కలబోసుకున్నాం.
జ్ఞాన ప్రసూనగారు, లక్శ్మి గారు, ఉమాదేవి, వరూధిని, సుజి, (అందరి పేర్లూ గుర్తు లేవు, క్షమించాలి.. ఇంకొక్కసారి కలుస్తే..), జ్యోతి వలభోజు, మాలా కుమార్   సరే సరి..
అక్కడ్నుంచి, ఉమాదేవిగారు వారింటికి తీసుకెళ్లి చల్లని పానీయం ఇచ్చి ఆదరించారు.
అన్నట్లు జ్యోతి బ్లాగ్‌లో ఫొటోలు ఉంటాయి కూడా.. నాకు పంపారు. చాలా బాగున్నాయి.
అదండీ సంగతి.
భానుమతి.

Related Posts:

  • అదిరేటి వంటలు. కాం ఇన్ అమెరికాబ్లాగర్ మిత్రులందరికి వందనాలు. చాలా రోజుల తరువాత పలుకరిస్తున్నందుకు మన్నించాలి.పెద్ద మునిగిపోయే పనులేమి లేవు కానీ.. అమెరికా  రావడం, వచ్చాక పిల్లలతో కాలం గడపడం.. ఆ పైన కాసింత బద్ధకం.సియాటల్ లో ఇప్పుడిప్పుడే వాతా వరణం… Read More
  • అదిరేటి వంటలు-2చాలా రోజుల తరువాత వస్తున్నానని ఎవరు నా బ్లాగ్ చూడట్లేదు. అయినా విసుగుచేందని.. లాగా రాస్తాను. ఎప్పటికైనా మిత్రులకు తీరిక చిక్కక పోతుందా? మా అబ్బాయిని ఆ మధ్యన ఏవైనా కూరగాయలు తెమ్మన్నా పొరబాటున.. కాస్ట్కో కి వెళ్లి ఒక బస్తాడు బ… Read More
  • అమ్మో! చలి..అమ్మో! చలి..తప్పించు కోవాలంటే ఒకటే మార్గం. హైదరాబాద్ వెళ్ళడమే!అందుకనే ప్రయాణం పది రోజులు ముందుకి జరిపేసి ఎల్లుండి విమానం ఎక్కేస్తున్నాం.వసంత కాలం, వేసంకాలం లండన్ ఎంతో చక్కగా ఉంటుంది. కన్నుల విందు చేసే చెట్లు.. రంగు రంగుల పూల… Read More
  • అనుబంధం అంటే ఇదేనా..అనుబంధం అంటే ఇదేనా..ఈ కాలంలో లండన్లో ఎముకలు కోరికే చలి.. బయటికి వెళ్ళాలంటే.. తలుచుకుంటేనే వణుకు. అయినా ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం?ఎలాగో మూడో నాలుగో తొడుగులు తగిలించి మొన్న పొద్దున్నే బయట పడ్డాం నేను, మావారు.అలా సౌత్ హాలు… Read More
  • ఆహ్లాదంగా ఆనందంగా సుందర వనంలోరచయిత్రులు.. అబ్బో! ఎప్పట్నుంచో అనుకుంటున్నాం వనభోజనానికి వెళ్దామని. కార్తీక మాసం వానలతో వరదలతో అలా గడిచిపోయింది. "ఆలస్యం అయినా ఫర్లేదు.. అసలు మానద్దు" అనే సామెతలాగా (మీరు ఊహించినట్లు ఇది ఇంగ్లీష్ నుంచి కాపి కొట్టిందే). మొన్న ఆదివా… Read More

3 వ్యాఖ్యలు:

సి.ఉమాదేవి said...

ఎంతో ఓపికగా వచ్చారు.చాలా సంతోషం.

జయ said...

చాలా సంతోషమండి. మీ అందరికీ అభినందనలు.

మాలా కుమార్ said...

దాదాపు 20 సంవత్సరాల తరువాత మిమ్మలిని కలవటం చాలా ఆనందం గా అనిపించిందండి . శ్రమ తీసుకొని మా ఇంటికి వచ్చినందుకు థాంక్స్ అండి .