Thursday, March 8, 2012

మాంస కృతులు - తినాలి బాగా!

Posted by Mantha Bhanumathi on Thursday, March 08, 2012 with No comments
శుభోదయం..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. పిండి పదార్ధం.. అదే.. మన తెలుగోళ్ళం చిన్నప్పట్నుంచీ తినడానికి అలవాటు పడ్డాం చూడండి. అవేం అసలు వద్దే వద్దంట.
మాకు బాగా తెలిసిన పంజాబీ ఆవిడ.. నలభై ఐదేళ్ళుంటాయి.. పూర్తిగా రోటీ వగైరాలు మానేసి.. కోడి, చేపలు .. అప్పుడప్పుడు కూరగాయలు తో ఆర్నెల్లు భోంచేసింది. ఠపీమని నలభై కిలోలు తగ్గి పోయింది. అంటే రోజూ నడవాలి కూడా. కనీసం వారానికి మూడు రోజులైనా జిం కి వెళ్ళాలి.
పొద్దున్నే లేచి జామకాయ ఒకటి తినాలి. ఆ తరువాత కప్పుడు సాంబారు కానీ ఏదయినా పప్పు కానీ.. (నిజం.. ఒట్టిదే..) .తింటే కోడిగుడ్లు ఒకటో రెండో తినచ్చు. నేను ఎవరూ చూడకుండా ఒక దోశ లాగించేస్తాను.
మధ్యాన్నం.. పెద్ద  గిన్నె నిండా సాలడ్.. మళ్ళీ సాంబారు లేదా పప్పు, పెరుగు.
ఇలాగే నో రైస్.. నో రోటీ.
ఒక వారం అలా చేశాక ఇంట్లో చికాకులు మొదలయ్యాయి..
అందుకని వారానికి రెండు సార్లు మీ ఇష్టం.. అని రూలింగ్ ఇచ్చారు.
అమ్మయ్య.. కాస్త నయం.
కాకపోతే ఒక్కోళ్ళకి ఒక్కో డిష్  చెయ్యలేక చంద్రాణీ (హెల్పర్) గోలెట్టేస్తోంది.
మా ఆయన మాత్రం తనిష్టం వచ్చిందే కానిస్తారు. చక్రవర్తిని ఎవరూ ఆదేశించలేరు కదా! పైగా తనేం తిన్నా అంతా ఉష్ణం కింద  అయి పోతుంది.. నా లాంటి వాళ్ళకి కణ విభజన మొదలవుతుంది.
ఇదంతా మావాడి ప్లానింగే..
అయితే అందరూ నిజంగానే నాజూగ్గ కనిపిస్తున్నారు.

0 వ్యాఖ్యలు: