శుభోదయం..ఎందుకో.. ఈ రోజు లేచి నప్పట్నుంచీ అందరితో ఏదో పంచుకోవాలని హృదయం ఘోషిస్తోంది. చెప్పద్దూ.. చెప్పలేని చికాకుగా ఉంది.
ఏం చెయ్యాలా అని ముఖ పుస్తకాన్ని తీసి తిరగేస్తుంటే సుధారాణి పంపిన పాట కనిపించింది. విందాంలే అని నొక్కా..
ఎన్ని నిజాలో నిష్ఠూరంగా నా చెవిలో రొద పెట్టాయి. నిజమే.. ఉగాదినాడు కలిసిన చాలా మంది స్నేహితులం.. "హాపీ ఉగాది" చెప్పు కున్నాం. శుభాకాంక్షలు అనే మాట పెద్దదీ మరియూ కష్టమూ కదా! మా జానకి "సోకాల్డ్" రచయిత్రి వైయుండీ సిగ్గులేదూ అని తిట్టింది కూడా.
మా ఎదురింటి పెద్ద మనిషి ఏదో సమస్య ఉందని ఇంటికి వచ్చి ఆంగ్లంలో మొదలు పెట్టి ఆపకుండా ఉపన్యాసం ఇచ్చాడు.. అదీ ఉగాది నాడే. నాకు ఒళ్ళు మండి పోయింది. నేను తెలుగులో.. తెలుగులోనే మాట్లాడాను. అయినా సరే.. ఏక పక్షంగా ఆంగ్ల సంభా్షణ సాగింది. అతను.. అచ్చ తెలుగు వాడే.. ఏం చేస్తాం.
మరీ "దిద్దుబాటు" నాటి తెలుగు మాట్లాడనక్కర్లేదు. బోలెడు ఆంగ్ల పదాలు తెలుగైపోయాయి.. ఎప్పట్నుంచో..
మా తోటి ఉపాధ్యాయుడొకరు అంటుండేవారు. ఆయన ఆంగ్లో భారతీయుడు లెండి. ఇంగ్లీ్ష్ మాటకి "ఉ" తగిలిస్తే తెలుగైపోతుందిట. బోలెడు ఉదాహరణలు చెప్పారు.
రోడ్డు, రైలు, పెన్ను, పేపరు , కారు, ఎన్నో.. చివరాకరికి "ఇంగ్లీషు" కూడా..
అదండీ సంగతి.. "బోరు" కొట్టానా?
ఇంతకీ ఆ పాట.. గజల్ శ్రీనివాస్ గారి "వాడే తెలుగోడు".

3 వ్యాఖ్యలు:
బావుంది పిన్ని!! అవును చాల
పదాలు తెలుగ్లింష్ అయిపోయాయి.
Bhanumathigaru..miru na kadhalu chadivi vyaktaparichina abhipraayaalaki dhanyavaadaalu.

Post a Comment