భారత దేశంలో సినిమా పరిశ్రమకి పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈ పరిశ్రమ వల్ల జీవనోపాధి పొందుతున్న వాళ్ళు, ఆనందిస్తున్న వాళ్ళు అందరు ఎల్లప్పుడూ తలుచు కోవలసిన మహా మనీషి.
మొట్టమొదటి సినిమా తియ్యడమే కాక 19 సంవత్సరాలల్లో 100 సినిమాలు తీసిన ఘనత కూడా ఆయనదే.
దాదా సాహెబ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా 'హరిశ్చంద్ర కి ఫాక్టరీ'.
కొత్త పరిశ్రమ మొదలు పెట్టడానికి 1911 సం. లో ఎంత శ్రమ పడ్డారో.. కళ్ళకి కట్టినట్లు చూపించారు ఇందులో.
మరాఠి సినిమా అయినా.. ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నాయి కనుక బాగా అర్ధమవుతుంది . ఒక వేళ లేకపోయినా చాలా సులభంగా అర్ధ మవుతుంది.
నెట్ ఫ్లిక్స్ ఉన్న వాళ్ళయితే ఎ ఇబ్బంది లేదు.. మేము హిందీ సినిమా అనుకుని పెట్టాము.. కూర్చున్న చోటి నుంచి కదలకుండా చూసాము.
ప్రతీ భారతీయుడు తప్పక చదవలసిన సినిమా. మన ఊళ్ళల్లో ఎక్కడ దొరుకుతుందో కనుక్కుని, లేదా DVD తెప్పించుకునైనా చూడవలసినదే.
చూస్తారు కదూ!
0 వ్యాఖ్యలు:
Post a Comment