Saturday, July 2, 2011

"అలా మొదలయింది."

Posted by Mantha Bhanumathi on Saturday, July 02, 2011 with 1 comment
నిజంగా ఆ సినిమా నే ..
కథ ఏమిటంటే..
ఇక్కడ అప్నా బజార్ అని ఒక భారతీయ బజారు ఉంది. అక్కడ మనం సరుకులు ఎక్కువగా కొంటే (ఎలాగా కొంటాం, మనకి దేశాభిమానం ఎక్కువ కదా!) డి.వి.డిలు ఫ్రీ గా ఇస్తారు. సహజంగానే తెలుగు చూస్తాం కదా! అక్కడేమో ఒకటో  రెండో కంటే ఎక్కువ ఉండవు.  ఇంకా తప్పేదేముంది.. ఉన్నవే తీసుకున్నాం.
అదిగో.. అందులో అది తప్ప మనకి ఇంకేం దొరకలేదు. ఇండియా లో ఉన్నప్పుడు పోస్టర్లు.. చూసాం.. కాని కొత్త పిల్లలు.. కొత్త డైరెక్టర్.. చెవులు బద్దలయ్యే డ్రమ్స్ మ్యూజిక్.. ఎందుకొచ్చిన గొడవ అని వదిలేశాం .
ఇక్కడ తప్పదు  కదా.. తోచదు.. భాషాభిమానం ఎక్కువ.
అలా మొదలైంది..
ఏదో పని చేసుకుంటూ చూడడం మొదలుపెట్టి.. మొదట్లో రొటీన్గా సాగుతోందిలే అనుకున్నామా.. కొంచెం సేపయ్యాక. చేస్తున్న పనులు ఆపేసి.. సోఫాకి అతుక్కు  పోయాం. మొదలు ఎలా అయినా.. మొత్తానికి సినిమా బాగుంది.
సంగీతం ఇంపుగా ఉంది.. హిరో, హీరోయిన్లు సహజంగా.. నటించారు. దర్సకత్వం. మెచ్యుర్డ్ గా ఉంది. ఈ ఫాక్షన్ గోలలు చూసి చూసి విసిగిపోయామేమో.. ఉల్లాసంగా ఉంది మనసుకి. సంగీతం హాయిగా ఉంది.
అందుకే. బేనర్, నటి నట  వర్గం,   దర్శకత్వం ఎట్సే ట్రాలు పేర్లుచూసి వదిలేయ్యకూడదని పాఠం నేర్చుకున్నాం .
మరి క్లాసికల్ అని చెప్పలేం కాని సరదాగా నవ్వుకుంటూ చూసేయ్యచ్చు.

Related Posts:

  • అమ్మో! చలి..అమ్మో! చలి..తప్పించు కోవాలంటే ఒకటే మార్గం. హైదరాబాద్ వెళ్ళడమే!అందుకనే ప్రయాణం పది రోజులు ముందుకి జరిపేసి ఎల్లుండి విమానం ఎక్కేస్తున్నాం.వసంత కాలం, వేసంకాలం లండన్ ఎంతో చక్కగా ఉంటుంది. కన్నుల విందు చేసే చెట్లు.. రంగు రంగుల పూల… Read More
  • తొలి పలుకుఅందరికీ వందనములు. బ్లాగర్ల ప్రపంచంలోకి తొలి అడుగు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రోత్సహించిన డెట్రాయిట్ నారాయణస్వామి గారికి ధన్యవాదాలు.ఇండియానాపోలిస్ లో జరిగిన వంగూరి-గీతా వారి సాహిత్య సభల్లో నారాయణస్వామి ఇచ్చిన ప్రసం… Read More
  • అనుబంధం అంటే ఇదేనా..అనుబంధం అంటే ఇదేనా..ఈ కాలంలో లండన్లో ఎముకలు కోరికే చలి.. బయటికి వెళ్ళాలంటే.. తలుచుకుంటేనే వణుకు. అయినా ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం?ఎలాగో మూడో నాలుగో తొడుగులు తగిలించి మొన్న పొద్దున్నే బయట పడ్డాం నేను, మావారు.అలా సౌత్ హాలు… Read More
  • అదిరేటి వంటలు. కాం ఇన్ అమెరికాబ్లాగర్ మిత్రులందరికి వందనాలు. చాలా రోజుల తరువాత పలుకరిస్తున్నందుకు మన్నించాలి.పెద్ద మునిగిపోయే పనులేమి లేవు కానీ.. అమెరికా  రావడం, వచ్చాక పిల్లలతో కాలం గడపడం.. ఆ పైన కాసింత బద్ధకం.సియాటల్ లో ఇప్పుడిప్పుడే వాతా వరణం… Read More
  • ఆహ్లాదంగా ఆనందంగా సుందర వనంలోరచయిత్రులు.. అబ్బో! ఎప్పట్నుంచో అనుకుంటున్నాం వనభోజనానికి వెళ్దామని. కార్తీక మాసం వానలతో వరదలతో అలా గడిచిపోయింది. "ఆలస్యం అయినా ఫర్లేదు.. అసలు మానద్దు" అనే సామెతలాగా (మీరు ఊహించినట్లు ఇది ఇంగ్లీష్ నుంచి కాపి కొట్టిందే). మొన్న ఆదివా… Read More

1 వ్యాఖ్యలు:

గీతిక బి said...

నాదీ సేమ్ టు సేమ్ ఫీలింగ్...