అనుబంధం అంటే ఇదేనా..
ఈ కాలంలో లండన్‌లో ఎముకలు కోరికే చలి.. బయటికి వెళ్ళాలంటే.. తలుచుకుంటేనే వణుకు. అయినా ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం?
ఎలాగో మూడో నాలుగో తొడుగులు తగిలించి మొన్న పొద్దున్నే బయట పడ్డాం నేను, మావారు.
అలా సౌత్ హాలు కేసి వెళ్తే మన బీరకాయలు, వంకాయలు లాంటివి తెచ్చు కోవచ్చని, అక్కడే వేడి వేడిగా సోమోసాలు, పానిపురి లాంటివి తినేస్తే మధ్యాన్నం ఇంటికొచ్చి పడుక్కోవచ్చని ప్లాన్.
బస్ ఎక్కి మంచి సీటు దొరికితే.. కిటికీ లోంచి షాపులన్నీ చూసుకుంటూ తీరుబడిగా వెనక్కి వాలి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. గంట పైన ప్రయాణం. కంగారేం లేదు.
తరువాతి స్టాప్ లో బస్ కదల బోతుండగా చెయ్యి చెయ్యి పట్టుకుని ఇద్దరు దంపతులు మెల్లిగా ఎక్కారు. 85 సంవత్సరాలు పైనే ఉంటుంది వయసు. ఒకరి కొకరు ఆసరా ఇచ్చుకుంటూ లోపలి వచ్చారు, కార్డ్‌లు రెండు మెషిన్ కి చూపించి వస్తుంటే ముందు సిట్‌లో కూర్చున్న కుర్రాడు లేచి పెద్దావిడ్ని కూర్చో పెట్టాడు. పక్కన అంతే వయసున్న ఇంకో ఆవిడుంది మరి.. తాతగారికి వెనుక సీటు చూపించి సహాయం చెయ్యబోయాడు లేచిన కుర్రాడు.
అబ్బే! అదేం కుదరదు.. తాతగారు తన స్వీట్ హార్ట్ పక్కనే కడ్డీ పుచ్చుకుని నిలబడ్డారు. ఆవిడ చెయ్యి ఇంకో చేతిలో ఉంచుకుని. అటుపక్క సీటులో ఉన్న మేము లేచి వాళ్ళిద్దర్నీ మా సీట్లలో కూర్చోపెట్టి మేము వేరే సర్దుకున్నాం. ఇద్దరి బుగ్గలు ఎర్రగా ఆపిల్ పళ్ళలా ఉన్నాయి. మొహాల్లో పసిపిల్లల అమాయకత్వం. కిటికిలోంచి చూసే ప్రతీది వివరించుకుంటూ వాళ్ళు చేసే ప్రయాణం ఎంతో ముచ్చటగా అనిపించింది మాకు.
జీవితాంతం తోడుగా నిడగా ఉండడం అంటే ఇదేనా అనిపించింది. ఇదో మరపురాని అనుభూతి.
Thursday, November 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
6 వ్యాఖ్యలు:
some old couples are really close. We once seen a old couple walking on the steet. Husband was walking a little slow. Wife turned arround and tessing him with her hands open and kept beside her cheeks. Me and my wife will never forget that scene.
మీ వృధ్ధజంట బ్లాగు కన్నా అంతకుముందు గ్రెనైట్ రాళ్ళ గురించి వ్రాసిన సమాచారం నాకు ఆసక్తి కలిగించింది. ఇంతకుముందు గ్రెనైట్ రాళ్ళు ప్రమాదం అన్న సంగతి నాకు తెలియదు. మరి ఇది ప్రజలకు తెలియచెప్పి గ్రెనైట్ వాడికాన్ని తగ్గించేందుకు సైంటిస్టులు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
దీని గిరించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత సైంటిస్టులదే కదా? మీ బ్లాగులో ఇటువంటి శాస్త్రీయ విజ్ఞానం మరింత అందిస్తూ ఉండండి. (మాకున్న టెన్షన్లు మరిన్ని పెరుగుతుంటాయిలెండి.ఫరవాలేదు)
పోడూరి కృష్ణకుమారి
అలాంటి జంటని నేను చూడలేకపోయాను గానీ విన్నాను.
మా పెళ్ళికాకముందు.. ఈయన వాళ్ళ పక్కింట్లో ఉన్న జంట గురించి చెప్తుండే వారు. వారి అన్యోన్యత, ఏ పని చేసినా కలిసి చేయడం గురించి ఈయన వివరిస్తుంటే వాళ్ళను చూడాలనిపించేది. కానీ హఠాత్తుగా ఆ పెద్దాయన చనిపోయారు. ఆయన భార్యని తలుచుకుని చాలా బాధనిపించింది నాకు.
కానీ ఆ మర్నాడు ఆవిడ కూడా చనిపోయారట.
ఇప్పటికీ వారిని తలచుకుంటే గుండె భారమవుతుందెకో నాకు...
గీతిక
నిజమే కృష్ణా!.. బోలెడు.. ఆధునిక సుఖ జీవనంలో వాడే వస్తువులు.. ఎరువులు, పురుగుల మందులు వంటి రసాయనాలు, వదిలించుకోలేని ప్లాస్టిక్ వంటి పదార్ధాలు.. రకరకాల రేడియేషన్ లను విదిల్చే ఎలెక్ట్రానిక్ పరికరాలు.. ఏదయినా మితంగా వాడుకుంటే మేలు కానీ ఇరవై నాలుగ్గంటలు చెవిలో సెల్ ఫోనో, ఐ పాడో పెట్టుకోడం.. టివినో, కంప్యుటర్ నో చూడ్డం.. ఎక్కడి వరకు వెళ్తుందో ఏమీ అర్ధం అవడం లేదు.
ఏదో తాపత్రయ పడి అనుకోడం కానీ చాపకింద నీరులా.. వైరస్ లా వ్యాపించిన ఈ అలవాట్లని మార్చుకోడం సాధ్యమేనా!
మనకి చాతనైనంత వరకు తెలియజెయ్యడ మయినా చెయ్యాలని నా ప్రయత్నం.
అవును గీతికా! నిజమైన ప్రేమ వయసుతో పాటు పెరుగుతుంది అని, ఎందఱో ఆది దంపతులని చూస్తె తెలుసుంది.
ఎవరికి వాళ్ళు - లాప్ టాపో, సెల్ ఫోనో, టి.వి రిమోటో పుచ్చుకుని కూర్చునే మా కాలం వాళ్ళకి అప్పుడప్పుడైనా అలాంటి దృశ్యాలు కళ్ళబడితే అయినా ఏం కోల్పోతున్నారో తెలుస్తుందేమో! అంత ఒకరికి ఒకరుగా వున్నవారి పిల్లలు ఎంత ఆరోగ్యకర వాతావరణంలో పెరుగుతారో - కదండీ!
Post a Comment