Tuesday, October 30, 2018

మా స్కూలు జ్ఞాపకాలు

Posted by Mantha Bhanumathi on Tuesday, October 30, 2018 with No comments
29-102018

1. శుభసాయంత్రం.
"అన్నీ ఉన్న విస్తరి అణగి ఉంటుంది.. అంటే ఏంటమ్మా?" అని మా అమ్మని అడిగా. అప్పుడు నాకు పన్నెండే ళ్లనుకుంటా.
"ఎంతో విద్య, మరెంతో తెలివి, ఇంకా డబ్బులు ఉన్నా కూడా.. అందరితో కలసి మెలసి స్నేహంగా ఉండడాన్ని అలా నిండు విస్తరి తో పోలుస్తారు." 
"ఓ.. మా స్కూలు హెచ్చెమ్ లీల గారి లాగానా?" 
అమ్మ నవ్వుకుంటూ తలూపి, అప్పుడే కోసిన అరటాకు పాయలో పప్పు, అన్నం, కూర, పచ్చడి వేసి నెయ్యి వడ్డించి, "తిను.. ఏం ఆలోచిస్తావూ.." అంది.
వెంటనే అరిటాకు లేపబోయాను. ఉహూ.. కదులుతేగా..
మా లీలా మేడమ్ కూడా.. ఎప్పుడూ, ఒకే రకంగా.. కనిపించిన అందరినీ పలుకరిస్తూ, అన్ని క్లాసులూ మొదలయే వరకూ, వరండాలో తిరుగుతూ ఉండేవారు.
ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు.. మా స్కూలు, మా వ్యక్తిత్వానికి పునాదులు వేసిన ఆలయం.
గుర్తుకొస్తుంటే.. అలా చెప్తుంటానేం?
అదే.. BH స్కూల్, బ్రాడీపేట, రెండోలైన్, పద్ధెనిమిదో అడ్డరోడ్డు.

0 వ్యాఖ్యలు: