Pages

Tuesday, October 6, 2015

బ్లాగ్ ఆవేదన.

   ఏమది ఏమది ఎందుకని
   ఎందుకు ఈ అలసత్వం
   ఎందుకు ఈ నిర్వేదం
   అసలెందుకు ఇదంతా?

   ఉన్నట్లుండి ఏమిటీ మాంద్యం
   ఊరుకుండలేని ఆత్రమా
   ఊహకి తోచని ఆవేశమా
   ఊపిరితియ్యలేని ఉత్సాహమా?

   అసలేం లేనే లేదు
   అంతా ఆత్మ న్యూనత
   అంతేమరి బ్లాగు నిలదీసి
   అడుగుతుంటే ఏం చెప్తాను?

   ఏమంత రాచకార్యాలున్నాయనీ
   ఏదేదో పనిమీద పని చేస్తుంటే
   ఏదోలే అని అనుకోవచ్చు
   ఏదో ఉద్ధరిస్తున్నానంటే నమ్మాలా?

   ఇంతకీ ఈ గోలంతా ఏంటంటే
   ఇవేళ నా బ్లాగ్ గురించి FB లో ఒక మాట వచ్చింది. అంతే..
   బ్లాగ్ కడిగేస్తోంది నన్ను..
   "ఎంతో ప్రేమ కురిపించిన బంధువులు నిన్ను పట్టించుకోరని ఎంత పిండుకుంటావు ఎప్పుడూ..
   మరి నేనలా కాదా?
   నన్ను పుట్టించావు.. నా ఆలనా పాలనా చూడవలసిన బాధ్యత నీది కాదా?
   అలా అనాధలా వదిలేసి, ఎప్పుడో 'జ్యోతి' జ్ఞాపకం చేస్తే అలా అలా తెరుస్తావు.
   కనీసం, రోజు విడుచి రోజైనా నాకు ఇంత తిండి పెట్టు."
 
   సరే.. సరే అని ఊరుకోబెట్టి జోకొట్టా నా బ్లాగుని..
   మనసులో శపధం చేసుకున్నా..
   రెండ్రోజులకోసారైనా ఏదైనా చెప్పి ఊరుకోబెట్టాలని.
   చూద్దాం.. ఎంతవరకూ నెరవేరుస్తానో!
 
 

 

 

 
   

0 వ్యాఖ్యలు: