చాలా రోజుల తరువాత వస్తున్నానని ఎవరు నా బ్లాగ్ చూడట్లేదు. అయినా విసుగుచేందని.. లాగా రాస్తాను. ఎప్పటికైనా మిత్రులకు తీరిక చిక్కక పోతుందా?
మా అబ్బాయిని ఆ మధ్యన ఏవైనా కూరగాయలు తెమ్మన్నా పొరబాటున.. కాస్ట్కో కి వెళ్లి ఒక బస్తాడు బ్రోకలి తీసుకొచ్చాడు.
అనిక 'ఐ హేట్ బ్రోకలి' అంటుంది. మిగిలిన వారు అలా చెప్పడానికి హిపోక్రసి అడ్డు వచ్చినా మొహం లో అదే ఫీలింగ్.. కూర ఎలా చేసినా కూడా.
అక్కడికీ తెలియకుండా సామ్బారులోను, స్పినాచ్ పప్పు లోను పడేస్తూనే ఉన్నా.. అయినా బస్తా అలాగే ఉంది. ఇంకా అది పని కాదనుకుని.. గ్రీన్ పులావ్ చేసేస్తే.. నోరెత్తకుండా (ఓన్లి తినడానికే తెరవడం) అవజేస్తారని గ్రీన్ పులావ్ చేసేద్దామని నిర్ణయానికి వచ్చా. చూస్తారా మరి..
రెండు గ్లాసులు.. సారీ.. కప్పులు బాసుమతి బియ్యం కడిగేసి పక్కన పెట్టుకోండి.
మసాలాలు..
౧.కప్పుడు కొత్తిమీర, కప్పుడు పుదీనా, రెండు పచ్చిమిర్చి మెత్తగా నూరాలి. అలాగే..
౨.కప్పుడు కొబ్బరి, ౩. కప్పుడు ఉల్లిపాయ ముక్కలు,౪. రెండు పెద్ద చెంచాలు అల్లం వెల్లుల్లి ముద్దా చేసేసుకోండి. ఒక పెద్దచేమ్చాడు ధనియా, చిన్న చేమచా జిర, నాలుగు లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, నాలుగు మిరియాలు, రెండు బిరియాని ఆకులు పొడి చేసుకోండి . (నే నయితే ఇక్కడ దొరికే కర్రి పౌడర్ పెద్ద చెంచాడు వాడేశా.. అది.. సిక్రెట్..).
పెద్ద నాన్ స్టిక్కి (కోడలు అమెజాన్ లో టైటానియం కోటెడ్ వంట సామాన్లు కొంది.. ఎత్తడానికి చచ్చే బరువైనా.. భలే ఉన్నాయి లెండి..) మూకుడు పొయ్యి మీద పెట్టి, పెద్ద గరిటెడు నూనె వేసి, పైన చెప్పిన వరుసలో అన్ని మసాలాలు వేస్తూ వేయించండి. ఈ లోగా పెద్ద బేసినుడు బ్రోకలి ముక్కలు మరీ పెద్ద కాక చిన్నా కాకుండా తరగండి. రెండు కప్పులు ఫ్రోజెన్ బఠానీలు, కావాలంటే ఒక కప్పు బీన్స్ ముక్కలు.. తయారు చేసుకుని.. వేగిన ముద్దలో వేసెయ్యండి. ఐదు నిముషాల్లో అంతా గ్రీన్ గా వేగుతూ ఉంటుంది. అవి వేగే లోపు నాలుగు కప్పులు నీళ్ళు మరిగించండి. ఆ నీళ్లు మూకుడులో వేసి, బియ్యం పోసి, తగినంత ఉప్పు.. (ఒక పెద్ద చెంచాడు వేసి చూడండి..) మూత పెట్టి, పావుగంట ఉడికిస్తే చాలు. గ్రీన్ రైస్ రెడి.. పైన సన్నగా తరిగిన జీడిపప్పు.. (నేను కలిపేశా.. లేకపోతె మొదటి వాళ్ళు పైనుంచి వేసుకునే ప్రమాదముంది..) సన్నని రొమానో టమాటో ముక్కలు అలంకరించేస్తే చాలు.
పెరుగు పచ్చడితో పెట్టారంటే.. ఆరోగ్య కరమైన సంపుర్ణాహారం ఊదేస్తారు .

0 వ్యాఖ్యలు:
Post a Comment