Friday, March 1, 2013

చైనీయుల నూతన సంవత్సరం..

Posted by Mantha Bhanumathi on Friday, March 01, 2013 with No comments
చైనీయుల నూతన సంవత్సరం..

మన లాగానే చీనీయులు నూతన సంవత్సర ఆరంభం చేసుకుంటారు. వాళ్ల పంచాంగంలోని (చంద్రమానం) ఆఖరి రోజునుంచీ, కొత్త మాసంలో పదిహేనో తారీఖు వరకూ.. పదిహేను రోజులు.
చైనాలో, చైనా ప్రజలు ఉన్న ప్రదేశాల్లో చాలా రోజులు సెలవు తీసుకునేది ఇప్పుడే. దీన్నే వసంత పండగ అని కూడా అంటారు. (spring festival.)
మన ఉగాది కూడా వసంతం లోనే కదా! మన కంటే ముందుగా వస్తుంది వీరిది.
కుటుంబం లోని వారందరూ కలుసుకోవడం, పెద్దలకి బహుమతులు ఇచ్చి, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం.. అందరూ కలిసి సరదాగా గడపడం.. అచ్చు మన పండగ లాగానే ఉంది కదూ?
ఏ దేశీయులైనా, ఏ మతస్థులైనా సాంప్రదాయాలు ఒకటే. ఈ సంవత్సరం మేము సింగపూర్ లో ఉన్నాం..
సింగపూర్ లో  చైనా టౌన్ లో న్యూ ఇయర్ డే నాడు ఒక వీధి..


0 వ్యాఖ్యలు: