పాతిక ముఫ్ఫై ఏళ్ళ క్రితం.. ఆకాశవాణి మేలుకొలుపుతో రోజు మొదలయ్యేటప్పుడు..
మధ్యలో ఒక టింగ్..టింగ్.. తరువాత ఒక ప్రకటన. అందులో వచ్చేది..
"నిజమే.. మీరు చెప్పినట్లు యాస్బెస్టాస్ రేకులనే వాడతాము.. మా తాతగారు వేయించిన రేకులు.. ఇప్పటికీ.."
ఆ ప్రకటనలన్నీ అందరి నోళ్ళలోనూ నానుతూ ఉండేవి.
ఆ తరువాత కొన్నేళ్ళకి యాస్బెస్టాస్ రేకులు వాడితే కాన్సర్ వస్తుందని కనుక్కుని.. వాటిని నిషేధించారు..(నిజంగానా! ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి మరి, భారతదేశంలో..)
ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ గ్రనైట్ రాళ్ళు.. రంగురంగుల డిజైన్లతో, కళ్ళు మిరిమిట్లు గొలిపే రంగులతో.. ఆధునిక భవంతులన్నిటిలోనూ కన్నులు విందులు చేస్తున్నాయి. నున్నగా.. ఆదమరిచి అడుగేస్తే జారి నడుము విరిగేట్లు.. ఎయిర్పోర్టుల్లోనూ.. పెద్ద పెద్ద మాల్స్ లోనూ, హోటల్స్‌లోనూ.. "ఇందుగలడందులేడనే" స్థంభాల్లోనూ.. అన్ని చోట్లా!
మరి ఈ రాళ్ళ తవ్వకాల్లో జరిగే అవకతవకలు అనేకానేక స్కాముల్లో కొన్ని.
ఇంతకీ మనం పట్టించుకోవలసిందేవిటీ అంటే..
ఈ అందాల రాళ్ళు అత్యధిక రేడియో ధార్మిక శక్తి కలిగి ఉన్నాయని. హైద్రాబాదులోని అధిక సంపన్నులుండే జుబిలీహిల్స్లో అత్యధికంగా రేడియో ధార్మిక శక్తి విడుదల అవుతోందిట.
మధ్యతరగతి ప్రజలు కూడా కనీసం వంటింట్లోనైనా.. వేయించుకుంటే అని కలలు కంటుంటారు.
ఇంతకీ మా వంటింట్లో వేయించిన రాళ్ళమీద పోర్టబుల్ గీగెర్-ముల్లర్ కౌంటర్ (రేడియో ధార్మిక కణాలని.. బీటా, గామా మొదలగు వాటిని కొలిచేది) పెడితే అది కుయ్.. కుయ్ అని ఆపకుండా మొత్తుకుంది.
వీటి వాడకం ఎంతవరకూ.. మానవజాతి, జంతుజాలాలు భరించగలిగే పరిధిలోనే ఉందా!
జియాలజిస్టులు దీనిమీద దృష్టి పెట్టి నిజానిజాలు వెల్లడిస్తే బాగుండును.
ఈ రేడియోధార్మిక కణాలు కాన్సర్ రావడానికి కారణాలు అని ఎప్పుడో నిరూపించారు.
Sunday, October 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
నారాయణస్వామి గారూ!
బరహాలో టైప్ చేసి పేస్ట్ చేస్తే తెలుగు ఫాంట్ రావట్లేదు. గూగుల్ లో చేసి చేస్తే వచ్చింది.
భానుమతి.
భానుమతి గారూ, నమస్కారం. బ్లాగుప్రపంచం లోకి స్వాగతం.
వీలు చూసుకుని నాబ్లాగు కూడా చూడండి,
నా బ్లాగు లింక్ ఇది: http;//kathamanjari.blogspot.com
Post a Comment