అందరికీ వందనములు.
బ్లాగర్ల ప్రపంచంలోకి తొలి అడుగు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రోత్సహించిన డెట్రాయిట్ నారాయణస్వామి గారికి ధన్యవాదాలు.
ఇండియానాపోలిస్ లో జరిగిన వంగూరి-గీతా వారి సాహిత్య సభల్లో నారాయణస్వామి ఇచ్చిన ప్రసంగం స్ఫూర్తితో మొదలు పెట్టాను. ఇంక నా మనసులో మాటలు బ్లాగర్లు అందరితో పంచుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఇందులో వివిధ రంగాలలోని ప్రతిభాశాలురతో పరిచయం ఏర్పడుతుందనీ, విజ్ఞానం పెరుగుతుందనీ ఆశిస్తున్నాను.
Sunday, October 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
6 వ్యాఖ్యలు:
నమస్కారం అండీ. బ్లాగు గూటి తలుపు తెరిచినందుకు అనేక అభినందనలు.
మీ బ్లాగ్ ఎడ్రసు ఇది:
http://bhanuramarao.blogspot.com
దీనిలోకి మీరు sign in చెయ్యాలి అంటే మాత్రం
http://blogger.com కి వెళ్ళి అక్కణ్ణించి లోపలికి ప్రవేశించాలి.
మరొక్క సూచన - మనసులోమాట అనే పేరు ఇప్పటికే కొన్ని బ్లాగులకి వాడుతున్నారు. అంచేత వేరేదన్నా పేరు ఎంచుకోండి.
మీకు బ్లాగు నిర్వహణలో ఏదన్నా సందేహం ఉంటే ఇక్కడే మీ బ్లాగులోనే అడగవచ్చు. చూసిన ఇతరబ్లాగర్లు సహాయం చేస్తారు.
భానుమతిగారు,
తెలుగు బ్లాగ్లోకానికి సుస్వాగతం.. మీకు ఎటువంటి సందేహమున్నా,సాయం కావాలన్నా అడగండి...
చాలా థాంక్స్ నారయణస్వామిగారూ, జ్యోతిగారు.
ఇందాకే ఒక మాట రాసి పోస్ట్ చెయ్యబోతే ఫాంట్ తెలుగులోకి మారలేదు. అక్కడే ఉన్న "అ"ని నొక్కినా కూడ. ఏమి చెయ్యమంటారు?
ఇది కామెంట్స్‌లో రాస్తున్నా. మరి చూడాలి..
ఈ బ్లాగుల ప్రపంచంలో తొలి అడుగేస్తున్న మీకు స్వాగతం భానుమతి గారూ.
మీ రచనల్లాంటి మంచి మంచి పోస్టుల్ని మీ నుంచి ఆశిస్తూ...
గీతిక
గీతికగారూ,
చాలా థాంక్స్. అప్పుడే ఒకటి పోస్ట్ చేశాను. చూసుంటారనుకుంటా!
బానుమతి గారు ,
బ్లాగ్ లోకాని కి స్వాగతం అండి .
ఆంధ్రభూమి లో మీ సీరియలస్ చదువుతుంటాను . బాగా రాస్తున్నారు .
Post a Comment