Monday, April 7, 2014

naa modati jnaapakaalu-2

Posted by Mantha Bhanumathi on Monday, April 07, 2014 with No comments
3. Kamala Parcha:   "నా మొదటి జ్ఞాపకం"
డాక్టర్ మామయ్య ఇంజీషన్ ఇస్తాను తీసుకు రమ్మన్నారట. ఎందుకు అంటే ఏమో మరి నేను చిన్నదానినిగా నాకు తెలీదన్నమాట! నాన్నగారు వాళ్ళ ఇంటి కి తీసు కెళ్ళారు . డాక్టర్ మామయ్య ఇంజెక్షన్ సిరంజన్ తీయగానే నాకని తెలిసిపోయింది. మరి నేను కుంచం పెద్దదానినిగా !అంటే మూడేళ్ళన్నమాట.
వద్దు వద్దు అని ఎత్తుకున్న నాన్నగారిని కాళ్ళ తో చేతుల తో కుమ్మేస్తూ ఏడ్చేస్తున్నాను.
డాక్టర్ మామయ్య కు భయమేసి," పోనీలే మూర్తీ , బేబీ ని ఇక్కడ వుండనీయి కాసేపు సుధ తో ఆడుకున్నాకున్నాక ఇస్తాను" అన్నారు.
నాన్నగారు ఐతే పని చూసుకొని వస్తానని వెళ్ళిపోయారు.
నేను సుధా ఎంచక్కా బొమ్మలాడుకున్నాము.అత్తయ్య లక్కపిడతలలో పప్పులు అటుకులు వేసి ఇచ్చింది. బొమ్మకు చీర కట్టి ఇచ్చింది.ఎంత సేపు ఆడుకున్నామో ఆకలేసింది. అత్తయ్య అన్నం కలిపి నాకూ , సుధకు ముద్దలు పెట్టింది.
మళ్ళీ ఇద్దరము ఆడుకుంటున్నాము. అప్పుడు డాక్టర్ మామయ్య నాకు తెలీకుండా నాకు ఇంజీషన్ ఇద్దామని నా దగ్గరకు వచ్చాడు. నేను చూసేసాను . అమ్మో లేచి పరిగెత్తాను. మామయ్య నా వెనుకే పరిగెత్తి నన్ను పట్టుకున్నాడు. నేను విదిలించుకొని టేబుల్ కింద దూరిపోయాను. డాక్టర్ మామయ్య దూరలేకపోయాడు. మరి లావు కదా ఎలా దూరుతాడు.

"
బేబీ రామ్మా . బేబీ గుడ్ గర్ల్ అట. మామయ్య మాట వింటుందిట." నన్ను తెగ బతిమిలాడుకున్నాడు. ఊమ్హూ నేను వినలేదు.
ఇంతలో నాన్నగారు వచ్చారు."మూర్తీ అప్పటి నుంచి శుబ్రంగా ఆడుకుంది. ఇంజెక్షన్ తేగానే ఇదో ఇలా బల్ల కింద దూరింది ." అని చెప్పాడు.
నాన్నగారు కూడా బల్ల కిందికి దూరలేరు . హే హే !
డ్రైవర్ వచ్చి , బల్ల కిందకు దూరి నన్ను బయటకు తీసుకొచ్చి ఎత్తుకున్నాడు.
కసక్ * * * (డ్రైవర్ చెయ్యి కొరికా .. మరి ఊరుకుంటానా )
కెవ్వ్. . .( డ్రైవర్ ఆర్తనాదం )
ధఢాం . . . (నన్ను కింద పడేసాడు )
వా(. . . అని ఏడుపు లంకించుకున్నాను . . . .
"
మూర్తీ ఇక లాభం లేదు. ఇంజెక్షన్ ఇవ్వటం కష్టం. టాబ్లెట్ ఇస్తాను . ప్రయత్నించి వేయి ."

ఇది నా మూడోఏట జరిగిన సంఘటన. ఇప్పటికీ డాక్టర్ మామయ్య బేబీ అంటూ నా వెనక పరుగెత్తటం , సీనంతా గుర్తే
(
కొసమెరుపేమిటంటే నాకు ఇప్పటికీ ఇంజెక్షన్ అంటే భయం. అవసరమై ఇంజెక్షన్ తీసుకోవాలన్నా , బ్లడ్ టెస్ట్ కు తీసుకోవలన్నా దాదాపు ఇంత రభసా జరుగుతుంది  )

ఫొటో నాదే  ఎక్కడా ఇంజెక్షన్ ఇచ్చేందుకు చోటు లేకుండా డ్రెస్ వేసుకున్నాను కదూ . భలే తెలివి నాది హి హి హి 
4. Sharada Tata "నా మొదటి జ్ఞాపకం".
 అప్పుడు నాకు మూడేళ్ళు ఉంటాయి అనుకుంటా, ఎందుకంటే లేచి పరిగెత్టటం వచ్చింది. మర్నాడు పొద్దున్నే శుక్రవారం (ఇది ఎందుకు అన్నది తరవాత చెప్తా). అమ్మ ఆరోజు పొద్దున్న నా పింక్ కలర్ పువ్వుల గౌన్ మా పనిమనిషి కి ఇవ్వటం లీల గా గుర్తు. మధ్యానం నాన్నమ్మ అన్నం పెట్టి పడుకో పెట్టింది, భోరున వర్షం. లేచే సరికి ఏదో ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయినట్టు లేచాను. నాన్నమ్మ వానకి దడుసుకొని లేచానేమో అని కంగారు పడి పాలు కలిపి ఇచ్చింది. పాలు తాగేసి ఆడుకొంటున్న నాకు మర్చిపోయింది గురుతుకి వచ్చింది (యురేకా!). పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గరికి వెళ్లాను. నాన్నమ్మ మా పనిమనిషి బాలమ్మ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అన్నది నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చూసాను , మెట్లు దిగటం స్టార్ట్ చెసాను. సగం దిగాక నాన్నమ్మ చూసింది అయ్యో ఎక్కడికే అని అడిగింది .. నేను గబా గబా దిగేసి మా బాలమ్మ గుడిస లోకి పరిగేత్తా.
నరసయ్య ( బాలమ్మ మొగుడు) ఏమ్మా రిక్షా తెమ్మందా అమ్మా అని అడిగాడు ? నేను అడ్డంగా తల ఊపి గుడిస లోపలికి పరుగెత్తా. అక్కడ స్వరూప (బాలమ్మ కూతురు) నా పింక్ కలర్ గౌన్ వేసుకొని పడుకుంది ( నా కంటే ఒక ఏడాది చిన్నది అనుకుంటా). దాన్ని లేపి దాని చేత గౌన్ విప్పించి, అది తీసుకొని ఇంటికి పరిగెత్తాను, అది నా వెనక్కాల ఏడుస్తూ పరిగెత్తింది. అది పడిపోకుండా ఇద్దరం సగం వరకు మెట్లు ఎక్కినట్లు ఉన్నాము. పైన ఉన్న నాన్నమ్మ బాలమ్మ ఇద్దరూ చూసారు. బాలమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరినీ ఎత్తుకొని పైకి వెళ్ళింది. ఇంతలో అయినది ఊహించిన నాన్నమ్మ చేతిలో ఉన్న చెంబుడు నీళ్ళు నా మీద గుమ్మరించింది (బాలమ్మ ఇంటికి వెళ్లి పిల్లని కొట్టి తీసుకొని వచ్చానని కోపం) ఇంత రాక్షసి లా తయారయ్యా వేమిటే అని అరుస్తూ నన్ను గౌనుని, స్వరూప ని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ....
లోపల అమ్మ దిగింది కొత్త గౌన్ పట్టుకొని, అయినది అంతా చూసింది. ప్రతి గురువారం ఆఫీసు నుంచి వస్తూ కొత్త గౌన్ తీసుకొని రావటం అలవాటు (ఇందాక చెప్పాను గా రేపు ప్రొద్దున్నే శుక్రవారం అని - అది అలా గుర్తుంది ) నాకు కొత్త గౌన్ చూపిస్తూ గౌన్ స్వరూప కి ఇస్తావా లేక ఇది ఇచ్చేయ్యనా అని ప్రశ్నార్ధకం గా సైగ చేసింది. ఒక చేతిలో కొత్త గౌన్ ఇంకొక చేతిలో ఫేవరెట్ పూల గౌన్ మ్యాచ్ చేసి నా పింక్ కలర్ గౌన్ స్వరూప కి ఇచ్చేసాను. అమ్మ పాప ని కొట్టి నందుకు గాను కొత్త బొమ్మ ఇప్పించింది. అమ్మ తరువాత నుంచి నాకు చెప్పి ఇవ్వటం మొదలు పెట్టింది. అలా అయితే పొద్దున్నే లేచి దాని గురించి వెతుక్కోకుండా కొత్త వాటితో ఆడుకువోటం మొదలుపెట్టాను. అమ్మ ఇప్పటికి అంటుంది " Valuable lesson learnt" చిన్న పిల్లలికి కూడా అన్ని అర్ధం అవుతాయి అని. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళ దగ్గర అని.

My father was working as an engineer in a remote village near Adoni.
It was near bellari presently in karnataka. I was about 5years old and I had three younger sisters.
one day there came a beeg thunderstorm and it started pouring.the houses,  and they were called middelu.
 The roof was leaking. My mother covered all of us in a big blanket and was attending her daily chores. Mean while my father ran out and came back after one hour.
There were four woolen sweaters and socks in his hand. He almost spent his salary to buy them. The rain subsided during the night but my father was getting a beating for that unnecessary expenditure till he passed away in 80.

 My mother, unfortunately,  never realized that,  what is money's value before his love and concern?

0 వ్యాఖ్యలు: