Monday, April 7, 2014

నా మొదటి జ్ఞాపకాలు- ముఖపుస్తక మిత్రులవి..

Posted by Mantha Bhanumathi on Monday, April 07, 2014 with No comments

1.. రామసుధ పప్పుః  అత్త చిన్ననాటి సంఘఠణ రాయమన్నారుకదా నాకు గుర్తున్నది రాస్తున్నాను , మేము వరంగల్ మానాన్నగారి ఉద్యొగరీత్యా వెళ్ళినప్పుడు..
నాకు రెండో మూడో యేళ్ళు అనుకుంటా , అంతకు ముందు మిల్లు కాలనీ లోని ఏఇంట్లో ఉన్నామో తెలీదుకాని చార్ బంగ్లాల లైన్లోని ఇంట్లోకి  మా
అమ్మ వాళ్లు మారాక, మా అక్క బాల కోసం వెతుకు తున్నారు ,తనేమో ఎదురుగా ఉన్న చెట్టెదో ఎక్కే సింది నేను కిందనించుని తనని చూస్తున్నాను ..
నాకు, అమ్మకి అక్క చెట్టు మీద ఉంది అని ఎలా చెప్పాలో తెలీలేదు , అమ్మ అక్కేది అని అడిగితే చెట్టు చూపించాను . అప్పుడు, నన్ను తిట్టింది అమ్మ. ఎందుకంటే.. ఆచెట్టు కొమ్మలు ఎక్కడో పైన ఉన్నాయి మరి అక్క ఎలా ఎక్కిందో నాకేం తెలుసు?  అక్కడ తనని కండ చీమ కుట్టింది దాంతో మా అక్క ఏడుపు మొదలు పెట్టింది , అప్పుడు అమ్మా వాళ్ళు చూసి నిచ్చెన తెచ్చి మా అక్కని కిందకి దింపారు.
 అప్పుడు అమ్మనువ్వు చెపితే ఏదొ అనుకున్నాను..” అంటూ బాధ పడింది.
 నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసికెళ్ళి చాకొలేట్ ఇచ్చి, ముద్దు పెట్టుకుంది .
సుధరాణీ..” అని మా నాన్నమ్మ పిలిచేవారు.. అలా పిలిచింది .
అప్పుడు మా అక్కకి 5 యేళ్ళు . సంఘటన అలా గుర్తుండి పోయింది.

2. Anuradha Bodla. చిన్ని జ్ణాపకం ......................... జ్ణాపకపు తెరలలో 
గణ గణ గణ మంటూ మ్రోగింది బడి గంట. పొలో మంటూ పిల్లలందరూ తరగతి గదుల్లోంచి బయటకు పరుగెత్తారు. క్లాస్ టీచర్లు అందరినీ లైన్లో పంపే ప్రయత్నం చేస్తున్నారు. అన్నయ్య మా క్లాస్ ముందుకి వచ్చి నా కోసం నిల్చున్నాడు. ఒక చేత్తో అన్నయ్య చెయ్యి పట్టుకుని ఒక చేత్తో నా చిన్ని సూట్ కేస్ (అప్పట్లొ అల్యూమినియం సూట్ కేసులు ఉండేవి స్కూల్ పుస్తకాలకోసం) పట్టుకుని చిన్ని చిన్ని అడుగులతో అన్నయ్య వెంట నడిచాను. స్కూల్ భవనమ్ నుంచి గేటు వేపు ఇద్దరమూ నడుస్తూ ఉండగా వెనక నుంచి ఒక కారు వేగంగా వచ్చేసింది. అన్నయ్య చాలా మెరుపు వేగంతో నన్ను వెనక్కి లాగాడు. నేనైతే సేఫ్. కాని నా సూట్ కేస్ మాత్రం కారు చక్రం కింద పప్పు పప్పు. 
…. నా సూట్ కేసూ ఊఊఊ.. అందరూ గుమి గూడారు. కారు లోని వాళ్ళు దిగి నా సూట్ కేస్ తీసి ఇచ్చారు. అందులో ఇరుక్కున్న నా పుస్తకాలు లాగి పీకి, చిరుగుతాయేమో అని భయపడి.. రెండు చేతులతో సూట్ కేస్ ని అలాపట్తుకుని ఇంటికి నడిచాము. 
ఎంత ప్రమాదం తప్పిందీ పిల్లకు అంటు అక్కున చేర్చుకుంటూ అమ్మ, ముక్కు చీదుతూ నాన్నమ్మ, ఏం కాలేదులే తల్లి అంటు నాన్న వెన్ను తట్టటం.. ఇవేవి నాకు పట్టట్లేదు. షేపులు అవుటయిన నా సూట్ కేస్ వేపె నా కళ్లన్నీ. అప్పచ్చీ లాంటి సూట్కేస్ తో రేపు స్కూల్కి ఎలా వెళ్ళాలి. పెద్ద ప్రశ్న. 
సారూ, మీ కోసమ్ ఎవరో వచ్చారు అంటు నాన్నని పిలిచారు ఎవరో. నాన్న ముందు గది లోకి వెళ్ళారు. 
అనూ నీకేం దెబ్బ తగల్లేదు కదా అంటూ నా చేతులూ కాళ్ళూ చెక్ చేస్తూ అమ్మ, అమ్మా నా సూట్ కేస్ అంటూ నేనూఎవరికీ నా గోల పట్టదే! 
చిన్నీ, చిన్నీ కారు వాళ్ళే నీకు కొత్త సూట్ కేస్ తెచ్చారు” (నా ముద్దు పేరుచిన్నిఅన్నమాట) అని మా అన్నయ్య కేక. రయ్యి మంటూ ముందు గది వేపు వెళ్ళాను. కర్టెన్ వెనక నిల్చుని తొంగి చూసాను. కొత్త సూట్ కేస్ తళ తళా మెరుస్తూంది. 
వద్దండి ప్లీజ్, నేను తీసుకోలేను. అంటూ చేతులు జోడించిన నాన్న. నమస్కరించి వెళ్ళిపోతున్న వాళ్ళూ.. దూరమయిపోతున్న తళ తళ మెరుపులూ..
ఫస్ట్ క్లాస్ చదివే నాకు దృశ్యం, కంచెరి వాడి దగ్గర వంకర్లు తీయించిన చొట్టలు పడ్డ సూట్ కేస్ తీసుకుని స్కూల్ కి వెళ్లినన్ని రోజులూ వెంటాడుతూనే ఉండింది.

0 వ్యాఖ్యలు: