Monday, April 7, 2014

naa modati jnaapakaM-5

Posted by Mantha Bhanumathi on Monday, April 07, 2014 with No comments
11. G SubbalakShmi- తొలి ఙ్ఞాపకం...
అయిందా పెళ్ళీ..
నాకు యిద్దరన్నయ్యలు. చిన్నప్పుడంతా నేను వాళ్ల వెనకాల తోకలా తిరిగేదాన్ని. నన్ను వాళ్ళిద్దరూ చాలా రష్చించేస్తుండేవాళ్లన్న మాట. అందుకని మూడు నాలుగేళ్ళప్పుడు నేనేంటో నాకే తెలీదు. కాని భానుమతిగారు మీ మీ ఙ్ఞాపకాలు గుర్తు చేసుకోండీ అన్నప్పుడు నేను నా ఙ్ఞాపకాల్లోకి రింగులు రింగులు చుట్టుకుంటూ వెళ్ళిపోయాను. అలా వెనక్కి వెళ్ళగా వెళ్ళగా బహుశా నాకు ఆరేళ్ళుంటాయనుకుంటాను...అప్పుడు నా వల్ల ఒకమ్మాయి యేడిచిన యేడుపు టక్కున గుర్తొచ్చింది. వెంఠనే అప్పటి పిల్ల రూపం కళ్ళకు కట్టింది. అంతే..పెన్ను చేతబుచ్చుకున్నాను..కాదు కాదు కీబోర్డ్ మీద వేలు పెట్టాను. అంతే. ఇదిగో ఇలా వచ్చేసింది. 
అప్పుడప్పుడే రేడియో కొంతమందిళ్లలో మాత్రమే వినబడుతున్నరోజులు. అప్పటికింకా కొన్ని పల్లెటూళ్ళకి కరెంట్ సరఫరా వుండేది కాదు. పల్లెటూళ్ళలో వున్నవాళ్ళు పట్టణాల్లో వున్న వాళ్ల చుట్టాలింటికి వచ్చినప్పుడు రేడియోని వింతగా చూసేవారు. అలాగే మా చుట్టాలు మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు అప్పుడు రాజమండ్రిలో పనిచేసేవారు. 
ఆరోజు పొద్దున్నే అందరూ పనుల్లో వున్నారు. మా చుట్టాలమ్మాయి నా ఈడుదో లేక నాకన్నా చిన్నదో నాకు గుర్తులేదు. పేరు కూడా గుర్తులేదు. పేరే కావాలంటారా. సర్లెండి."సంతలో చింతకాయ" అనుకుందాం. అది రేడియోనే చూస్తూ కూర్చుంది. నాకు నా గొప్పతనం చూపించుకోవాలనిపించి, రేడియోలో ముల్లుని అటూ ఇటూ తిప్పాను. అప్పటిదాకా రేడియోలో వినబడుతున్న మగగొంతు కాస్తా ఆడగొంతులా మారిపోయింది. చింతకాయ రేడియో వెనకవైపుకి అంటే గోడకి, రేడియోకి మధ్య వున్న సందులోకి తలదూర్చి మగాళ్ళు కూర్చుని పాడుతున్నారా..ఆడాళ్ళా.. అన్నట్టు కుతూహలంతో తొంగిచూస్తోంది. 
"
ఏయ్.. అలా వెనక్కెళ్లకు, షాక్ కొడుతుంది.." అన్నాను ఖంగారుగా."అంటే.."అంది. "అంటే చచ్చిపోతావన్నమాట.." నా పరిఙ్ఞానాన్నంతా చూపించేసాను. చింతకాయకి కుతూహలం ఆగలేదనుకుంటాను..మళ్ళీ వెనకవైపు తొంగిచూడబోయింది. "ఒద్దన్నానా.."అన్నాను గట్టిగా. వినలేదా చింతకాయ. నావైపు చూస్తూ రేడియో వెనకాల చెయ్యి పెట్టింది. "యేయ్.."అన్నాను గట్టిగా. టక్కున చెయ్యి ఇవతలకి లాగేసుకుని ఇంకో చేత్తో దాన్ని గట్టిగా పట్టేసుకుంది. నిజంగా షాక్ కొట్టిందేమో అనుకుని, చెప్పినమాట వినకుండా రేడియో వెనకాల చెయ్యి పెట్టినందుకు విసుక్కుంటూ.."అయ్యిందా పెళ్ళీ.." అన్నాను.అంతే.. బేరుమంటూ ఒక్కసారి రాగాన్నందుకుందా అమ్మాయి. చింతకాయ ఏడుపు విని ఇంట్లో తలో మూలా వున్నవాళ్లందరూ పరిగేఠుకుని వచ్చేసేరు. వచ్చినవాళ్లని చూసి చింతకాయ శృతి హెచ్చించింది. 
"
యేవైందే నా తల్లీ.. నే చచ్చిపోయేనే.." అంటూ అస్తమానం చింతకాయని నానాతిట్లూ తిట్టే వాళ్ళమ్మ దాన్ని చుట్టేసుకుని భోరుమంది.
పిల్ల వెక్కుతూ నావైపు చెయ్యి చూపించి మళ్ళీ రాగాన్ని కంటిన్యూ చేసింది. 
"
యేం చేసేవే దాన్ని..?" చుట్టాలకి జరిగిన అమర్యాదకి తెగ బాధపడిపోతూ, మడితో వున్నానన్న మాట మర్చిపోయి మా అమ్మ గట్టిగా నా చెయ్యి పట్టుకుంది. "దానికి షాక్ కొట్టింది." ఒక్కమాటలో చెప్పాన్నేను. అంతే..బాంబు పేలినట్టు హడిలిపోయారందరూ. చింతకాయ చుట్టూ జేరి, "యేదేది" అంటూ దాని ఒళ్ళంతా పరీక్షించడం మొదలెట్టేరు. అది వెక్కుతూనే అడ్డంగా తలూపుతూ మళ్ళీ నా వైపు చూపించి, మళ్ళీ యేడుపు మొదలెట్టింది. దాంతో అందరూ నేను దాన్నేదో చేసేసేననుకుని నన్ను దోషిలా నిలబెట్టి యేంచేసేవని అడగడం మొదలెట్టేరు. నేనేం చేసేనూ..యేం చెయ్యలేదని చెపితే ఒక్కరూ వినరే..ఇంతలో చింతకాయ రాగం యెక్కువ చేసింది. 
మా అమ్మమ్మ గబగబా వంటింట్లోకెళ్ళి ఇంత బెల్లమ్ముక్క తెచ్చి దాని నోట్లో పెట్టేసింది. ఓవైపు నోట్లో బెల్లమ్ముక్క, ఇంకోవైపు యేడుపు..దేన్ని అందుకోవాలో తెలీట్లేదు ఆచింతకాయకి. నోరిప్పి యేడిస్తే బెల్లమ్ముక్క కింద పడిపోతుందేమో..పోనీ బెల్లమ్ముక్క చప్పరిద్దావంటే యేడుపు తన్నుకుని వచ్చేస్తోందాయె.. 
నేను మటుకు మహా కుతూహలంగా చూస్తున్నాను. క్షణాని కోసారి బెల్లమ్ముక్క చింతకాయ నాలుక చివరిదాకా రావడం, అంతలోనే అది గుటకేసుకుంటూ దాన్ని మళ్ళీ లోపలికి లాక్కోడం, మళ్ళీ అంతలోనే దుఃఖం ముంచుకు వచ్చేసి గట్టిగా నోరిప్పి యేడవడం, బెల్లమ్ముక్క నాలిక చివర్దాకా రావడం, అది యెప్పుడు పడిపోతుందా అని నేను ఊపిరి బిగపట్టి చూడడం.. చింతకాయ మళ్ళీ లోపలికి లాక్కోడం..అబ్బా..అలా ఫార్సంతా రెణ్ణిమిషాలు నడిచాక, మా మావయ్యే అనుకుంటాను..లేపొతే మా బాబయ్యో..యెవరో గుర్తులేదుకానీ వచ్చి చింతకాయని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పైకండువాతో కళ్ళు, మొహం తుడిచి, దాన్ని నెమ్మదిగా బుజ్జగించి, "యేమైందమ్మా..చెల్లాయి కొట్టిందా.."అనడిగేడు.(ఇంట్లో నన్నంతా చెల్లాయని పిలుస్తార్లెండి). అది కాదని అడ్డంగా తలూపింది. 
హమ్మయ్య అని ఇంకా పూర్తిగా అనుకోకుండానే మళ్ళీ నావైపు చూపించి యేడవడం మొదలెట్టింది. మళ్ళీ అందరూ నన్నో హంతకురాలిని చూసినట్టు చూడ్డం మొదలెట్టేరు. మా మావయ్య యెంత మంచివాడో..నెమ్మదిగా దాని యేడుపు మాన్పించి, అసలేం జరిగిందో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ సమాచారమంతా చింతకాయ నుంచి రాబట్టేడు. 
యేతావాతా తేలిందేంటంటే.. చింతకాయ రేడియో వెనకనుంచి చెయ్యి బయటికి తీసినప్పుడు నేను "అయిందా పెళ్ళీ.." అన్నానుట. పెళ్ళి అన్నమాట రోజుల్లో ఆడపిల్లల దగ్గర యెంత చిన్నవయసువాళ్ళైనా సరే అంటే వాళ్ళు సిగ్గుతో మెలికలైనా తిరుగిపోయేవాళ్ళు. లేదా.అక్కణ్ణించి పారిపోనైనా పారిపోయేవారు(). 
విషయం నాకేం తెలుసూ.. అన్నయ్యల వెనకాల మగరాయుళ్ళా తిరిగేదాన్ని.. ఇంతకీ నేను చింతకాయని "అయిందా పెళ్ళీ.." అంటూ దాని పెళ్ళిమాట యెత్తినందుకు అది అంత ఘోరంగా యేడిచిందన్నమాట. అప్పటికీ ఇప్పటికీ నాకు అర్ధంకానిదొక్కటే.. పెళ్ళన్న ఒక్కమాటకి మరీ అంత వెక్కిళ్ళు పెడుతూ, బెల్లమ్ముక్కని బాలన్స్ చేస్తూ యేడవాల్సినంత అవసరం వుందా... అని. 

12. Behara LakshminarayaNa-  చిన్నప్పటి జ్ఞాపకం
-----------
మేము తెనాలిలోని నాజర్ పేటలో వున్నప్పుడు .... రోజు మధ్యాహ్నపు వేళ...రొండోకలాసు చదువుతున్న నేను..ముందువేపున్న నట్టింట్లో నవారు మంచంపై పడుకుని హాయిగా కాళ్ళూపుకుంటూ మాగన్నుగా నిద్రకోసం కునికిపాట్లలో వున్న సమయం. వంటింట్లో గడపపై తలపెట్టుకుని మా అమ్మ పక్కన్నే బజ్జున్న మా చెల్లెలికి చిచ్చకొడ్తూ చేత్తో ఏదో లావుపాటి బుక్కుపట్టుకునీ, పైకే చదువుతోంది..సిలుకు చీరపై ఎండపెట్టిన వడియాలపై నీళ్ళు చల్లి వాటిని ఊడపీకేందుకు తంటాలు పడ్తున్న పక్కింటి ఇల్లుగల వాళ్ళ పిన్నిగారు మా అమ్మ చదువుతూన్న దానికి కొడ్తూ పరాకుగా వింటున్నట్లు నాకు తెలుస్తూనే వుంది.
మధ్యాహ్నం తిన్న బీరకాయపప్పు, పొట్లకాయ కూర, పాత చింతకాయ పచ్చడి రుచులు నెమరేసుకుంటూ, రాత్రికి ఇంకేం వండమని మా అమ్మ దగ్గర పేచీ పెట్టాలా అని ఆలోచనల్లో మునకలేస్తున్నా.. చేయి నిక్కర్ జేబులో దాచిన తియ్య గోలీల పొట్లాన్ని తడుముతుంటే...రేప్పొద్దున్న స్కూల్ కెళ్ళేటప్పుడు మా అక్కతోపాటు ఇల్లుగల వాళ్ళ దక్సినా మూరితీ, గిరిజాలోడూ, రెండిళ్ళవతలి టాక్సులాఫీసరుగారబ్బాయి శ్రీమన్నారయణా, వెనకవీధి నుండి నడిచొచ్చే సరస్వతక్కయ్యా..వీళ్ళందరికీ నా దగ్గరున్న తియ్య గోలీలు చూయించి ఎట్టా గొప్పలు పోవాలా , వారికి ఒక్కోరికి ఎన్నివ్వాలా, అసలెవరికైనా ఒక్కటైనా ఇవ్వాలా వద్దా అనే రకరకాల ఊహలతో తెగాలోచించేస్తూ..కులాసాగా కాళ్ళూపుకుంటో, నిద్ర రాక గింజుకుంటూ అవస్థలో పడున్న నా చెవులకు పిలుపు వినబడ్డంతోటే బిత్తర పోయా.
వాకిట్లో జాజితీగలల్లించిన చెక్క గేటునూపుతూ కుప్పా వారి తాతయ్యగారు మా అమ్మను పిలుస్తోన్నట్లున్నారు..మా వీధికి రెండు బజార్లవతల హోమియో ఆస్పత్రి నడిపే( పాపం నశ్యంపొడి ఖర్చు తప్ప ఫీజే తీసుకోరుట) కుప్పా రామలింగ శాస్త్రి గారు గొడుగు మూస్తూ వాకిట్లో నిలబడున్నారు. పిలుపు వంటింట్లో వున్న మా అమ్మ కంటే ముందు నాకే వినపడ్డంతోటే...హోరి బగమంతుడా..ఈయన ఇట్లా మా ఇంటికే ఎందుకొచ్చాడ్రా సామీ అనుకుంటూ గుండె గుభిల్లుమని కొట్టుకుంది. పూర్తిగా మెలుకువలోకి వచ్చేసిన తర్వాత , రోజు నాకు రాంబజినే తప్పదు..అనుకుని మంచం ఎత్తేసి నా రగస్య స్థావరంలోకి మాయమైపోయా...కుప్పావారి తాతగారి మూడోపిలుపుకు లోకంలో పడ్డ మా అమ్మ పాపం కంగారుకంగార్గా ఆయనను లోపలికి తీసుకొచ్చేసింది..ఎండన పడి ఏమిటిలా వచ్చారు బాబాయ్ గారూ అంటూ మజ్జిగ కూడా తెచ్చిచ్చింది...తర్వాత ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసుగా..తెరలు తెరలుగా తన్నుకొస్తున్న నవ్వునాపుకోవడం నా తరం కాలేదు. పరుపులూ, బొంతల చుట్టలు పెట్టే బెంచీ కింద దూరిన నేను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని వాళ్ళిద్దర్నీ గమనిస్తున్నా. పైనుంచి దుప్పటి వేలాడేసుందిగా నేను మాత్రం వాళ్ళకి కనపడనన్న మాట..
కొంచం సేద తీరిన తర్వాత కుప్పా వారి తాతగారు మా అమ్మను నాలుగూ చివాట్లేసేసారు..హేవిటమ్మా..వరలక్ష్ముమమ్మా నీ ధోరణీ నువ్వూ, చదవేస్తే వున్న మతిపోతుందన్నట్లు,,చోద్దెం కాకుంటే పసిబిడ్డను అలా గాలికొదిలేసి అమ్మలక్కలతో కలిసి మారిణింగు షో సినేమాలకెళ్తావా..ఒక్కగానొక్క కొడుకాయే..కొంచమైనా జాగరత్తుండొద్దూ..పాపం మీ లచ్మింనారాయణ వంటిపై చొక్కా కూడా లేకుండా మా ఆస్పత్రికొచ్చి జొరం ఇంకా తగ్గలేదూ గోలీలిమ్మని అడిగితే నా కడుపు తరుక్కపోయిందీ...అయినా పసోడ్ని ఒక్కడ్నీ అంత దూరం ఎలా పంపుతావూ, బిడ్డ కంటే నీకు సినిమాలూ చిత్రమూలాలూ ఎక్కువయ్యాయా అంటూ గుక్క తిప్పకోకుండా కూప్పడేసారు..పాపం బిక్కముఖంతో మా అమ్మ అడ్డుపడబోయినా ఆయన ఆగితేనా..తాతగారి దండకం పూర్తయిన తర్వాత ముందు మా అమ్మ చేసిన పని నా కోసం వెతకడమే కదా...బెంచీ కింద దూరి దాక్కున్న నేనెట్టా దొరుకుతానూ..ఇంట్లోనూ, ఇంటి చుట్టూ ఉసూరుమంటూ వెతికొచ్చిన తర్వాత ( లోగా, ఆంజనేసామీ, గండం గట్టెక్కితే నీ గుడికొచ్చి పద్నాలుగో పద్దెనిమిదో గుంజీలు తీస్తానయ్య, కాపాడూ అంటా నేను ఒహటే మొక్కులూ, చెంపలేసుకోడాలూ).తర్వాత మా అమ్మ అసలు విషయం బయటపెట్టింది.హయ్యో కర్మ నాకు సినిమాలకెళ్ళే రాత గూడానా బాబాయ్ గారూ , పొద్దున వీడేం చేసాడో మీకు తెలీదసలూ..వారప్ఫది రోజులుగా పాలూ రొట్టే పెడ్తున్నావూ ఇహ నాకు జొరం తగ్గిపోయిందీ వళ్ళు కూడా చల్లగాయైపోయింది చూడూ అని ఒహటే సతాయించీ, కావాలంటే తాతయ్యగారినడిగి పథ్యమేం పెట్టమంటారో కనుక్కునొస్తానని మీ దగ్గరకొచ్చాడు..నేను పన్లో పడి గమనించలేదా, వాడు తిరిగొచ్చి హాయిగా జొరం తగ్గిపోయిందీ తియ్యటి కూరల్తో అన్నం తినమని చెప్పారంటే రోజు అన్నం కూడా పెట్టానండీ..అంటూ లిస్టు చదివింది...దాంతో నోరు తెరిచిన తాతయ్యగారు ,వాడు ఒట్టొంటితో ఎండలో వచ్చేసరికి ఒళ్ళువేడిగా అనిపించి మళ్ళీ గోలీల సీసా ఇచ్చి మూడుపూటలా ఇంతకు ముందులానే వాడమని చెప్పంపానమ్మా.మా అమ్మ పక్కింటి పిన్నిగారితో రత్నా టాకీసులో మీనా సినిమాకెళ్ళిందీ, నన్నే మీ దగ్గర మాత్తర్లు తెచ్చేసుకోమందీ అంటూ గోడకట్టినట్లు జాలిగా చెప్తే నాకు అయ్యో పాపం అనిపించీ ..బోయినానికింటికెళ్తూ వాడికెట్టా వుందో చూసీ,నిన్నోసారి హెచ్చరిద్దామనొచ్చా...హోరి వీడసాధ్యం కూలా ..ఏమనుకోకమ్మా ..అంటూ హాచ్చెర్రపోయారు..
పాపం ఆయనకేం తెలుసూ రోజూ ఏదో ఒక కమ్మని సాదకం లేకుంటే నాకేమో ముద్ద దిగదాయే...ఆయనే పథ్యం మార్చమన్నారని చెప్పకుంటే ఇంకెన్ని రోజులని బ్రెడ్డూ పాలతో జీవుడ్ని ఇబ్బంది పెడ్తామబ్బా..అయినా ఓమియ్యా తియ్య గోలీల కమ్మటి రుచి మిగిలిన పిల్లలకేం తెలుసూ...ఇట్టా కుప్పా వారి ఆస్పత్రిలో గోలీలు తెచ్చుకునే భాగ్యం అందరికీ దక్కుతుందా,,వాటి రుచిని పొగుడుతా మిగిలిన పిలకాయలు కుళ్ళుకునేలా ఫోజులు కొడ్దామని కాదూ నేనంత కష్టపడి వాటిని తెచ్చుకుందీ..మా వీధిలో ఎవరికైనా జొరాలొచ్చినా, కడుపులో నొప్పయినా ఎంబట్నే తగ్గిపోవాలనీ వాళ్ళ అమ్మా నాన్నలు ఇండీషన్ డాట్టర్ దగ్గరకే తీసుకెళ్ళే వారు.. డాట్టర్ గార్ని చూడ్డంతోటే మా నిక్కర్లు తడిసిపోయేవి కదా..మా అమ్మ చాలా మంచిది కాబట్టి నాకూ, మా అక్కయ్యకూ కుప్పా వారి ఆస్పత్రిలో తియ్య మాత్తర్లే ఇప్పించేది...సరే..ఇక తర్వాత ఏమైందంటే...వాళ్ళిద్దరూ అలా మాట్లాడేసుకునీ ఇక లచ్మిం నారాయణ అనే వాడు ఏం చెప్పినా వెంటనే నమ్మేయకూడదనీ తీర్మానాల్చేసుకున్నారట..వాళ్ళు కబుర్లలో వుండగానే నాకు నిద్దరొచ్చేసి బెంచీ కిందనే సోలిపోయా...మరలా సాయంత్రం ఏవో మాటలు పెద్దగా వినపడ్డంతో పాటు, కాలిపై చురుక్కుమనడంతో హఠాత్తుగా మెలుకువ వచ్చేసింది. కళ్ళు నలుపుకుని పూర్తిగా స్పృహలోకి వచ్చేలోగా కాలిపై మంట నెత్తికెక్కడం ఇంకా బాగా గుర్తుంది..కాఫీ కుంపట్లో అట్లకాడ సెగచేసి మా అమ్మ నా కాలిపై ఛర్రుమన్పించింది...దాంతో నేను గావురు బావురుమంటూ ఒకటే రాగాలూ, పక్కింటి పిన్నిగారూ వాళ్ళ పిల్లలూ పరుగెత్తుకుని వచ్చి వైపు వినోదం మరో వైపు నన్ను ఓదార్చడం... గలభాలో మా అక్కయ్య టక్కున కమ్మరకడ్డీలు, జీళ్ళూ తెచ్చి నా దోసిట్లో పోసేయడం వంటి సంఘటనలు శరవేగంగా జరిగిపోయాయి...ఇంతకీ నేను బెంచీ కింద దాక్కున్నట్లు మా అమ్మకెలా తెలిసిందనా మీ కొచ్చినింగూ...హూ..సదరు మా అక్కయ్య భారతీదేవిగారే స్కూల్ నుంచి వచ్చిన తర్వాతా,ఉప్పందించినట్లు తర్వాత శుభసమయంలో వారే వెల్లడించారు...ఇదండీ తియ్యగోలీలూ-అట్లగాడ వాతా కత..
13. V.Bala Murty-
Top of Form
నా మొదటి జ్ఞాపకం 
భానుమతిగారు రాయమన్నారు కదా అని మొదలుపెట్టేను కాని పెద్దగా చెప్పుకోనేవి ఏవి గుర్తుకు రావడంలేదు . నాకప్పుడు నాలున్నరేళ్లు ఉంటాయేమో, మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము నాగపూర్లో ఉండేవాళ్ళం .
నాకు ఉయ్యాలా ఊగడమంటే చాలా ఇష్టం ఉండేది. ఉయ్యాలా అంటే, రెండు పెద్ద పోల్స్ పైన ఒక ఖమ్బి కి ఒక చెక్క బల్ల అన్నమాట. నేను అప్పుడు చాలా దుడుకుగా ఉండేదాన్నని మా అమ్మ అనేది. ఆవిడ నేను ఊగుతున్నంత్సేపు నాకు కాపలా కాచేది.
 ఎందుకంటే నేను నా ఫ్రెండు ప్రేమా కలిసి ఉయ్యాలా మీద ఎదురెదురుగా నుంచొని చాలా వేగంగానూ ఎంతో పైపైకి ఊగె వాళ్ళము. అంటే ఆవిడ గ్రౌండ్ కంట్రోలర్ అన్న మాట. రోజు మేము ఊగే సమయానికి పెద్దవాళ్లు ఎవరూ లేరన్నంమాట. ఇంక మా ఆనందం చూస్కోండి! ఇద్దరం జోరు జోరుగా అలా ఆకాశం లో తేలిపోతున్నట్లు ఊగసాగేము. నిజం చెప్పాలంటే దాని థ్రిల్లు ఇప్పటికీ కళ్లల్లో మెలుగుతుంది .
 ఆకాసంలో ఎగిరిపోతూ చల్లని గాలి మా మోఖాల మీద తగుల్తుంటే వొళ్ళు తెలియకుండా కిలకిలా నవ్వుకుంటూ ఊగేస్తున్నాము. ఇంతట్లోకి పైన ఒక లింక్ విరిగి పోయి, ఉయ్యాల ఒక పక్కకి జారి పోయింది. జారిపోతూ మమ్మల్నిద్దరిని చెరోవైపు విసిరేసింది. కానీ, చాల లక్కీగా పక్కనున్న లాన్ లో పడడం వలన కాళ్లు చేతులు విరగలేదు. చేతులు కాళ్ళు ముఖం చీరుకుపొయి రక్తాలు కారుతూంటే భయంవల్ల బోరుమన్నాము.
ఇంక చూస్కోండి మా మా అమ్మలు తిట్టిన తిట్టు తిట్టకుండా బరబరా లాకేళ్లి ఏదో ఆకాలపు ఫస్ట్ ఎయ్ద్ చేసారు. అప్పటినుండి ఇప్పటిదాకా నేను ఉయ్యాలా ఎక్కితే ఒట్టు. ఇప్పటికీ మెల్లిగా ఊపినా నాకు భయమే.

14. Sujata timmana-
నా మొదటి జ్ఞాపకం ...
భానుమతి గారు ఇలా పోటీ పెట్టారు అని తెలిసి చాల సంతోషం వేసింది....మొదటి జ్ఞాపకం...అనగానే....మది పొరల్లో దాగిన మధురానుభూతుల బాల్యం కళ్ళ ముందుకొచ్చి కదలాడుతుంది .."అమ్మ " అమ్మఅనే పదం నిర్వచనం లేని అద్భుతమే ...కాదనను కాని నాకు మాత్రం మా నాన్నగారి దగ్గరే...చేరిక ఎక్కువ ...ఊహ తెలిసినప్పటి నుండి నాన్న తోనే గడిపిన క్షణాలు నాకు బాగా గుర్తు ఉన్నాయి....
అప్పుడు బహుశా నాకు మూడు ..లేక ...నాలుగు ..సంవత్సరాలు..ఉండవచ్చు..మరి...నేను ఒక్కదాన్నే అమ్మా నాన్నలకు అప్పుడు...నా తరువాత 13 సంవత్సరాలకు తమ్ముడు పుట్టాడు ...కాబట్టి నాకు చాలా చాలా గారాబం చేసేవారు నాన్నగారు...(నిజానికి నేను కూడా అంతే మొండిగా ఉండేదాన్ని ). ఏమి అల్లరి చేసానో సరిగా జ్ఞాపకం లేదు కాని అమ్మ నన్ను చీపురు పుల్లతో కొట్టింది .... దెబ్బలు తప్పించుకోవటానికి అమ్మతో పెనుగులాడాను... నా చిట్టి చేతి మీద రక్తం చుక్కలు ...అది చూసి...గావుకేకలేస్తూ.... ఏడుస్తూంటే ....అప్పుడే వచ్చిన నాన్నగారు అమాంతం నన్ను ఎత్తుకొని ముద్దు చేస్తూ...అమ్మని బాగా...తిట్టారు...అసలు నాన్నగారిలో...అంత కోపం నేను ఎప్పుడు చూడలేదు....నిజంగా నేను బెదిరిపోయాను .....అమ్మ ఏమి మాట్లాడక చేతిని చూసుకుంది...పగిలిన గాజు చేతిలో ఇరుక్కుని అక్కడి నుంచి ధారగా రక్తం కారుతూ కనిపించింది ... రక్తం నా చేతికి తగిలి నాకే గాయమయిన భ్రమ కలిగింది ....గాజుముక్కలని తీసి అవతల పారేస్తూ...అమ్మ...కళ్ళు కోపంగా చూస్తున్నా..అందులో " తండ్రి కూతుళ్ళు ...ఇంతే.." అనే అభిమానం ...మురిపెం ...ఇంకా ఎన్నో అనుభూతులు అమ్మ మోములో..మెరిసి ఉండవచ్చు....అని విషయం తలుచుకొని అమ్మ ఎప్పుడు చెపుతూ ఉంటే ...అనుకునే దాన్ని...
ఫోటోలో ఉన్న నాకు రెండు జడలు వేసి నన్నురెడీ చేసి .. స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తియించింది కూడా నాన్నగారే...మరి....అన్ని ఆయన చేతే...చేయించుకునే దాన్ని...జన్మ జన్మలకు కూడా ఆయన ఋణం నేను తీర్చుకోలేనేమో..మరి...
ధన్యవాదాలు భానుమతి గారు........15. Padma Ayyagari-
Bhanu Pinni, here is my first memory. I am sorry I am not writing in Telugu - one, my telugu is not as commanding as my English and two, I don't have Telugu fonts and it is hard to write Telugu in English. Any way, here is my first memory and hopefully V Bala Murthy will like this too. 

Feb 6 1966 - I was five and a half years old. A beautiful dawn in Spring - ever so slightly chilly, birds were up and loud in their callings to each other in our Oleander tree (Ganneru), the bells of the first Arathi were ringing in the Hanuman Temple next door, the mosque in the street behind is singing Azaan for morning prayers, the Irani hotel across our house on the corner of Bazaarghat Chowrasta is getting ready to greet its morning customers with hot cups of chai.

Our house was brimming full with people busily getting ready. The smells of hot filtered coffee as well as tea were wafting through the house. It was my uncle Rambabu's wedding day and we were getting ready to go to the wedding performed at Mahakali Temple, Secunderabad. All six sisters of my dad's and their spouses and children who attended the wedding were in our house. We were a joint family - our family and my dad's eldest brother and family lived together in Bazaarghat Chowrasta for ten years before we shifted. Apparently we moved into that house when my mum was pregnant with me and that house has seen so many meaningful occasions happen both good and bad, including my wedding and my daughter's birth as well as us leaving from there to Australia, it saddens me to think that house is no longer there and a block of apartments stand in its place. I get very nostalgic thinking of that house.

Anyway, I can't remember who got me dressed, but I was dressed in a powder blue frock with silver zari stripes on it (I think it was some kind of organza material as it had a lining stitched underneath as well) and my cousin Lalita had a long skirt made of the same material and a blouse to match. I was quite happy with that dress and was proudly showing off to all my aunties.

As it happens every morning for majority of the population, I had the nature's call and it was quite an urgent one as well to empty my system so I can fill it again with the wedding goodies. I started to run towards the toilet and suddenly had this pull on the edge of my frock, so hard that I couldn't run forward. I turned around and there was my Dad's fifth sister - Prabhakaram Attayya - they live in Secunderabad and the wedding was in Secunderabad Mahakali Temple - so I don't know why she was at our place instead of attending the wedding directly from her place. Maybe she wanted to be with her sisters who all came from far away places.

Anyway, there she was pulling and holding the edge of my frock tight and would not let me go. I had to go but she won't let loose. She was saying "take your frock off before going to the toilet" and I just could not comprehend why I had to do that. I had to go and she says "Gown vippu", I pull away, she tugs me back - "gown vippi vellu", getting more demanding even as my attempt to escape was getting more frantic. I am not sure what happened next, I think I had to oblige as expected of a little child. I can see that scene to this day quite clearly.

Eventually we all got ready and left the house in a bus for the wedding. I got to sit on the metal trunk of my uncle Rambabu next to him. That's all I remember, I don't remember any thing of the wedding itself. There are photos of the wedding but I am not in any one of them, perhaps I was busy playing or perhaps I was trying to avoid my dear Prabhakaram Attayya in case she demanded that I defrock in MahaKali temple.....

Bala Pinni - V Bala Murthy is my dear Uncle Rambabu 's wife and I cherish this memory.
16. SammeTa Umadevi.
భానక్కయ్య పెట్టిన చిన్నతనపు జ్ఞాపకం పోటీకి
నా చిన్న తనాన మా ఇంట్లో మా మామయ్యలు ఉండేవారు .. అమ్మ వాళ్ళను ఏమి తెమ్మని చెప్పిన వాళ్ళ సైకిల్ ఎక్కి నేనూ వాళ్ళతో బయలు దేరేదాన్ని .. దారి పొడుగునా కనపడ్డ బొమ్మల్లా కొని పెట్టమని గొడవ పెట్టేదాన్ని .. మల్లీ దారినే తిరిగి వేల్ల్టాముకదా అప్పుడు కొని పెడతాం లెమ్మని చెప్పి .. దారిని కాకుండా మరో దారిని తీసుకువ్చేవాళ్ళు .. ఇంటికి రగానే అమ్మకి చెప్పి రాగం అందుకోబోతుంటే అక్క ఉమ్మకి ఇందాక సున్నుండ పెడతానన్నావు కాదా అని తీపి పదార్థాల్ంటె ఇష్టపడే నన్ను బోల్త కొట్టించే వారు .. స్వీట్ లేకుంటే వట్టి చక్కేరయిన తినేదాన్ని .. చక్కర అనటం రాక ఇక్కి అనే దాననని మా మామయ్యల స్నేహితులు .. మీ ఇక్కి పాప ఏమి చేస్తుంది అని అడిగేవారట ..
మండు వేసవి లో కుటుంబమంతా తిరుపతి బయలు దేరాము .. కళ్యాణ కట్టలో నున్నని తాజా గుండ్లతో బయటకు వచ్చిన నాన్నను మమయ్యలను అన్ని కోణాల్లోనూ చూసుకుని రహస్యంగా నవ్వుకున్నాను .. దర్శనం ఎలా జరిగిందో గుర్తు లేదు గాని ముక్కు వరకు పెట్టుకున్న నామాలు .. నున్నగామెరిసి పోతున్న గుండ్లను .. మీసాలు కూడా తేసేసి బోసిగా కనపడుతున్న మూతులను మల్లి మల్లి చూస్తూనే ఉన్నాను .. నన్ను అక్కా అన్నయ్యను ఒక్కొక్కరు చూసుకునే ఒప్పందం .. నడక సాగుతున్నది .. అమ్మ చేతి లో చెల్లి ఉంది .. అక్క అన్నయ్య మామయ్య తో నడుస్తున్నారు .. న్నాన్న నా చెయ్యి పట్టుకుని విసా.. విసా నడుస్తున్నారు. ఆయనతో సమంగా నడవలేక మెల్లగా చెయ్యి విడిపించుకుని .. ఎర్రకుచ్చుల గౌను అమ్మాయి బొమ్మ .. చూస్తూ మురిసి పోయి బొమ్మ ఎంతా అన్నాను .. వంద రూపాయలు కొంటావా పాపా అన్నాడు కొట్టాయాన . మా నాన్న నడిగి కొంతా అని పక్కకు చూసా నాన్న కనపడలేదు .. పక్కు చూసా మామయ్యలు అమ్మ అక్క అన్నయ్య .. ఏవూ కనపడలేదు .. గుండె జారి పోయింది .. ఎన్నో ఎదురుగా ఎన్నో గుండ్లు ఒక్కటి నాన్నదీ మమయ్యల్ది కాదు .. ఆరున్నొక్క రాగం అందుకున్నా.. ఏమయింది పాప .. అనగానే అమ్మా .. నాన్నా అంటూ శృతి పెంచాను .. అయ్యో మీ అమ్మ నాన్న కన పడడం లేదా ..ఇల రామ్మా ఏడవకు. ఇక్కడ కూర్చో .. చేతిలో ఎర్రకుచ్చుల గౌనున్న అమ్మాయి బొమ్మ అంటే అన్ని మర్చి పోయి చేతిలో ఉన్న బొమ్మని చూసి మురిసి పోయా నా ఎదురుగా.. మూడు కోతుల బొమ్మ... కోడి పుంజు బొమ్మ .. చేతిలొ పిప్పరమెంటు .. అమ్మ ఉమా ..ఉమా నాన్న పిలుపు కగారు కంగారుగా నాన్నా.. మామయ్యలు తిరుగుతూ కనపడ్డారు... బాగా అయ్యింది లే ఎప్పుడు బొమ్మ కొనమన్నఈ సారి పండక్కి కొందాంలే అంటారు నాన్న .. తిరిగి వచ్చేటప్పుడుకొన్దామ్ రేపు కొందాం అంటారు మామయ్యలు ఇప్పుడు చూడండి నా చుట్టు అన్నీ బొమ్మలే .. మళ్ళీ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కంగారు పడుతూ హడావుడిగా మా వాళ్ళు కనపడ్డారు ఎనడకు మెరిసి పోతున్న వాళ్ళ గుండ్లు చూస్తూ .. బుడింగున తల వంచుకుని కూర్చున్న వాళ్ళు వెలి పోయారు ..భలేఅ య్యింది అనుకున్న .. నువ్వేమి కగారు పడకు పాపా మీ వాళ్లు రాకుంటే .. పోలీసులకు చెప్పితే .. వాళ్ళే మీ అమ్మ నాన్నలను వెతికి పెడతారు... కొట్టాయన మరో పిప్ప్రమెంటు ఇచ్చాడు. సారి మల్లీ కగారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు .. అరుస్తున్నారు..నా చేతి లో యెర్ర కుచ్చుల గౌను బొమ్మ మెరుస్తున్నది.. గుండ్లు మరింత మెరుస్తున్నాయి.. వారి వెనుక అమ్మ. నీరసంగా నడుస్తూ.. అక్కడ మెరుపు నా మనస్సుకు చురుక్కుమని తగిలింది .. అమ్మ కళ్ళలో ఎండకు మెరుస్తూన్న నీళ్ళు చెంపల పయికి జారి పోతున్నాయి .. అంతే అమ్మ అని గట్టి గా అర్సుస్తూ .. ఒక్క దూకున బొమ్మల కొట్టు బయటకు ఉరికా .. అమ్మ నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు.. ఎర్రకుచ్చుల గౌను బొమ్మ కన్నా . నన్ను దగ్గరకు పొదవుకున్న అమ్మ చీర కుచ్చిల్లు ఎంత బాగున్నయ్యో ...
17. Nanduri Sundari nagamani- భానక్కయ్య పెట్టిన చిన్నతనపు జ్ఞాపకం పోటీకి...

నాకప్పుడు మూడున్నర నాలుగేళ్ళు ఉంటాయి. నాన్న గారి ఉద్యోగరీత్యా మేము భీమవరం లో ఉండే వాళ్ళం. అక్కడ త్యాగరాజ భవనం అనే భవనం చాలా ప్రసిద్ధి. అక్కడ బహుశ: సాహితీ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు, సంగీత కార్య క్రమాలు జరిగేవేమో మరి. భవనానికి దగ్గరలో ఒక మంచినీటి చెరువు ఉండేది. అక్కడి నుంచి తాగటానికి అమ్మ ఇత్తడి బిందెతో నీళ్ళు మోసుకొని వచ్చేది. రోజుకి ఒక బిందె. చెరువును ఎడ్వర్డ్ చెరువు అనే వారు.

బాగా చిన్నపిల్లను కాబట్టి నన్ను ఇంట్లో ఉంచి వెళ్ళలేక, తనతో పాటే తీసుకువెళ్ళేది అమ్మ నన్ను. రోజు చెరువు గట్టున కూర్చోబెట్టి, తాను రేవులో దిగి మంచి నీళ్ళు బిందెతో ముంచుకుంటూ ఉంటే, అమ్మ అడుగులో అడుగేసుకుంటూ తనని అనుసరించి నేను కూడా చెరువులో దిగిపోయి, మునిగిపోయాను. వెనకనుంచి ఎవరో, 'అమ్మా, నీ కూతురా, నీళ్ళల్లో పడిపోయింది...' అని అరిస్తే గబుక్కున బిందె వదిలేసి, అమ్మ నన్ను పట్టుకోవాలని ప్రయత్నించింది కాని, నేను తనకి దొరకనంత దూరం వెళ్ళిపోయాను అప్పటికే... అప్పుడు ఎవరో దయామయుడు నీళ్ళల్లో దూకి, నా గౌనును దొరక బుచ్చుకొని, పైకి లాగి తీసుకు వచ్చాడు.

అప్పటికే అమ్మ గట్టిగా కేకలు పెడుతూ, షాక్ తో ఏడుస్తోంది. అతను అమ్మకి నన్ను ఇవ్వగానే గబుక్కున గుండెలకు హత్తుకొని, ఏడ్చేసింది. అంతే కాదు, భరించలేని కోపం తో నన్ను బాదేసింది కూడా... నాకీ జ్ఞాపకం లీలగానే అయినా, తిన్న దెబ్బలు మాత్రం స్పష్టంగానే గుర్తు...

తర్వాత నాలుగేళ్ల వయసులోనే మరో సంవత్సరం ఎక్కువ వేసి రాయించి నాన్న ప్రాథమిక పాఠశాల లో వేసారు. బడికి వెళ్ళను అని రోజూ గోలే... రోజు నా చేతిలో పలక లాక్కుందని నా సీనియర్ పిల్లని పలకతోనే గట్టిగా నెత్తి మీద కొట్టి ఇంటికి వచ్చాను. పలక ఏమైంది? అని అడిగిన అమ్మా నాన్నలకి పగిలిపోయింది అని చెప్పాను. కాసేపటికే పిల్ల తో వాళ్ళ అమ్మా నాన్న హాజర్... నాన్నకి ఫిర్యాదు, పాపకి తగిలిన గాయం చూపిస్తూ... నాన్న వాళ్ళని క్షమించమని అడిగి, సర్ది చెప్పాక, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నాకు 'పేకా' వారి అబ్బాయితో కళ్యాణ వైభోగం జరిగిపోయింది...

ఇవీ నా చిన్ననాటి జ్ఞాపకాలు... నాకు బాగా గుర్తున్నవి...నచ్చాయా మీకు..