Thursday, March 8, 2012

మాంస కృతులు - తినాలి బాగా!

Posted by Mantha Bhanumathi on Thursday, March 08, 2012 with No comments
శుభోదయం..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. పిండి పదార్ధం.. అదే.. మన తెలుగోళ్ళం చిన్నప్పట్నుంచీ తినడానికి అలవాటు పడ్డాం చూడండి. అవేం అసలు వద్దే వద్దంట.
మాకు బాగా తెలిసిన పంజాబీ ఆవిడ.. నలభై ఐదేళ్ళుంటాయి.. పూర్తిగా రోటీ వగైరాలు మానేసి.. కోడి, చేపలు .. అప్పుడప్పుడు కూరగాయలు తో ఆర్నెల్లు భోంచేసింది. ఠపీమని నలభై కిలోలు తగ్గి పోయింది. అంటే రోజూ నడవాలి కూడా. కనీసం వారానికి మూడు రోజులైనా జిం కి వెళ్ళాలి.
పొద్దున్నే లేచి జామకాయ ఒకటి తినాలి. ఆ తరువాత కప్పుడు సాంబారు కానీ ఏదయినా పప్పు కానీ.. (నిజం.. ఒట్టిదే..) .తింటే కోడిగుడ్లు ఒకటో రెండో తినచ్చు. నేను ఎవరూ చూడకుండా ఒక దోశ లాగించేస్తాను.
మధ్యాన్నం.. పెద్ద  గిన్నె నిండా సాలడ్.. మళ్ళీ సాంబారు లేదా పప్పు, పెరుగు.
ఇలాగే నో రైస్.. నో రోటీ.
ఒక వారం అలా చేశాక ఇంట్లో చికాకులు మొదలయ్యాయి..
అందుకని వారానికి రెండు సార్లు మీ ఇష్టం.. అని రూలింగ్ ఇచ్చారు.
అమ్మయ్య.. కాస్త నయం.
కాకపోతే ఒక్కోళ్ళకి ఒక్కో డిష్  చెయ్యలేక చంద్రాణీ (హెల్పర్) గోలెట్టేస్తోంది.
మా ఆయన మాత్రం తనిష్టం వచ్చిందే కానిస్తారు. చక్రవర్తిని ఎవరూ ఆదేశించలేరు కదా! పైగా తనేం తిన్నా అంతా ఉష్ణం కింద  అయి పోతుంది.. నా లాంటి వాళ్ళకి కణ విభజన మొదలవుతుంది.
ఇదంతా మావాడి ప్లానింగే..
అయితే అందరూ నిజంగానే నాజూగ్గ కనిపిస్తున్నారు.

Wednesday, March 7, 2012

తెలుగోళ్ళ మండీ

Posted by Mantha Bhanumathi on Wednesday, March 07, 2012 with 3 comments
శుభోదయం..ఎందుకో.. ఈ రోజు లేచి నప్పట్నుంచీ అందరితో ఏదో పంచుకోవాలని హృదయం ఘోషిస్తోంది. చెప్పద్దూ.. చెప్పలేని చికాకుగా ఉంది.
ఏం చెయ్యాలా అని ముఖ పుస్తకాన్ని తీసి తిరగేస్తుంటే సుధారాణి పంపిన పాట కనిపించింది. విందాంలే అని నొక్కా..
ఎన్ని నిజాలో నిష్ఠూరంగా నా చెవిలో రొద పెట్టాయి. నిజమే.. ఉగాదినాడు కలిసిన చాలా మంది స్నేహితులం.. "హాపీ ఉగాది" చెప్పు కున్నాం. శుభాకాంక్షలు అనే మాట పెద్దదీ మరియూ కష్టమూ కదా! మా జానకి "సోకాల్డ్" రచయిత్రి వైయుండీ సిగ్గులేదూ అని తిట్టింది కూడా.
మా ఎదురింటి పెద్ద మనిషి ఏదో సమస్య ఉందని ఇంటికి వచ్చి ఆంగ్లంలో మొదలు పెట్టి ఆపకుండా ఉపన్యాసం ఇచ్చాడు.. అదీ ఉగాది నాడే. నాకు ఒళ్ళు మండి పోయింది. నేను తెలుగులో.. తెలుగులోనే మాట్లాడాను. అయినా సరే.. ఏక పక్షంగా ఆంగ్ల సంభా్షణ సాగింది. అతను.. అచ్చ తెలుగు వాడే.. ఏం చేస్తాం.
మరీ "దిద్దుబాటు" నాటి తెలుగు మాట్లాడనక్కర్లేదు. బోలెడు ఆంగ్ల పదాలు తెలుగైపోయాయి.. ఎప్పట్నుంచో..
మా తోటి ఉపాధ్యాయుడొకరు అంటుండేవారు. ఆయన ఆంగ్లో భారతీయుడు లెండి. ఇంగ్లీ్ష్ మాటకి "ఉ" తగిలిస్తే తెలుగైపోతుందిట. బోలెడు ఉదాహరణలు చెప్పారు.
రోడ్డు, రైలు, పెన్ను, పేపరు , కారు, ఎన్నో.. చివరాకరికి "ఇంగ్లీషు" కూడా..
అదండీ సంగతి.. "బోరు" కొట్టానా?

ఇంతకీ ఆ పాట.. గజల్ శ్రీనివాస్ గారి "వాడే తెలుగోడు".