Wednesday, July 6, 2011

"హరిశ్చంద్ర కి ఫాక్టరీ"

Posted by Mantha Bhanumathi on Wednesday, July 06, 2011 with No comments
భారత దేశంలో సినిమా పరిశ్రమకి పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే.  ఈ  పరిశ్రమ వల్ల జీవనోపాధి పొందుతున్న వాళ్ళు, ఆనందిస్తున్న వాళ్ళు అందరు ఎల్లప్పుడూ తలుచు కోవలసిన మహా మనీషి.
మొట్టమొదటి సినిమా తియ్యడమే కాక 19 సంవత్సరాలల్లో 100 సినిమాలు తీసిన ఘనత  కూడా ఆయనదే.
దాదా సాహెబ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా 'హరిశ్చంద్ర కి ఫాక్టరీ'.
కొత్త పరిశ్రమ మొదలు   పెట్టడానికి 1911 సం. లో ఎంత శ్రమ పడ్డారో.. కళ్ళకి కట్టినట్లు చూపించారు ఇందులో.
మరాఠి సినిమా అయినా.. ఇంగ్లీష్  టైటిల్స్  ఉన్నాయి  కనుక  బాగా  అర్ధమవుతుంది .  ఒక వేళ లేకపోయినా చాలా సులభంగా అర్ధ మవుతుంది.
నెట్ ఫ్లిక్స్ ఉన్న వాళ్ళయితే ఎ ఇబ్బంది లేదు.. మేము హిందీ సినిమా అనుకుని పెట్టాము.. కూర్చున్న చోటి నుంచి కదలకుండా చూసాము.
ప్రతీ భారతీయుడు తప్పక చదవలసిన సినిమా. మన ఊళ్ళల్లో ఎక్కడ దొరుకుతుందో కనుక్కుని, లేదా DVD తెప్పించుకునైనా చూడవలసినదే.
చూస్తారు కదూ!

Saturday, July 2, 2011

"అలా మొదలయింది."

Posted by Mantha Bhanumathi on Saturday, July 02, 2011 with 2 comments
నిజంగా ఆ సినిమా నే ..
కథ ఏమిటంటే..
ఇక్కడ అప్నా బజార్ అని ఒక భారతీయ బజారు ఉంది. అక్కడ మనం సరుకులు ఎక్కువగా కొంటే (ఎలాగా కొంటాం, మనకి దేశాభిమానం ఎక్కువ కదా!) డి.వి.డిలు ఫ్రీ గా ఇస్తారు. సహజంగానే తెలుగు చూస్తాం కదా! అక్కడేమో ఒకటో  రెండో కంటే ఎక్కువ ఉండవు.  ఇంకా తప్పేదేముంది.. ఉన్నవే తీసుకున్నాం.
అదిగో.. అందులో అది తప్ప మనకి ఇంకేం దొరకలేదు. ఇండియా లో ఉన్నప్పుడు పోస్టర్లు.. చూసాం.. కాని కొత్త పిల్లలు.. కొత్త డైరెక్టర్.. చెవులు బద్దలయ్యే డ్రమ్స్ మ్యూజిక్.. ఎందుకొచ్చిన గొడవ అని వదిలేశాం .
ఇక్కడ తప్పదు  కదా.. తోచదు.. భాషాభిమానం ఎక్కువ.
అలా మొదలైంది..
ఏదో పని చేసుకుంటూ చూడడం మొదలుపెట్టి.. మొదట్లో రొటీన్గా సాగుతోందిలే అనుకున్నామా.. కొంచెం సేపయ్యాక. చేస్తున్న పనులు ఆపేసి.. సోఫాకి అతుక్కు  పోయాం. మొదలు ఎలా అయినా.. మొత్తానికి సినిమా బాగుంది.
సంగీతం ఇంపుగా ఉంది.. హిరో, హీరోయిన్లు సహజంగా.. నటించారు. దర్సకత్వం. మెచ్యుర్డ్ గా ఉంది. ఈ ఫాక్షన్ గోలలు చూసి చూసి విసిగిపోయామేమో.. ఉల్లాసంగా ఉంది మనసుకి. సంగీతం హాయిగా ఉంది.
అందుకే. బేనర్, నటి నట  వర్గం,   దర్శకత్వం ఎట్సే ట్రాలు పేర్లుచూసి వదిలేయ్యకూడదని పాఠం నేర్చుకున్నాం .
మరి క్లాసికల్ అని చెప్పలేం కాని సరదాగా నవ్వుకుంటూ చూసేయ్యచ్చు.

Tuesday, June 21, 2011

happy father's day

Posted by Mantha Bhanumathi on Tuesday, June 21, 2011 with 1 comment

This is our 4 yr. old grand daughter Anika’s father’s day card.
It seems the card was given in the school, and the kids have to fill in the blanks, including some drawing on the empty page. The teacher asked the questions and filled the blanks with the answers given by the kids.
We felt Anika’s answers are funny and it is amazing how a four year old thinks.
In the drawing the tall one is amma. You can see the hair on both sides of the face. Similarly for Anika on the left. In her view amma is a gaint  and nanna follows her..
The one who is next tall is nanna with few hairs standing straight on the head. So, you can find her brother.
Please read the answers.. you will enjoy.

Friday, June 17, 2011

అదిరేటి వంటలు-2

Posted by Mantha Bhanumathi on Friday, June 17, 2011 with No comments
చాలా రోజుల తరువాత వస్తున్నానని ఎవరు నా బ్లాగ్ చూడట్లేదు. అయినా విసుగుచేందని.. లాగా రాస్తాను. ఎప్పటికైనా మిత్రులకు తీరిక చిక్కక పోతుందా?
మా అబ్బాయిని ఆ మధ్యన ఏవైనా కూరగాయలు తెమ్మన్నా పొరబాటున.. కాస్ట్కో కి వెళ్లి ఒక బస్తాడు బ్రోకలి తీసుకొచ్చాడు.
అనిక 'ఐ హేట్ బ్రోకలి' అంటుంది. మిగిలిన వారు అలా చెప్పడానికి హిపోక్రసి అడ్డు వచ్చినా మొహం లో అదే ఫీలింగ్.. కూర ఎలా చేసినా కూడా.
అక్కడికీ తెలియకుండా సామ్బారులోను, స్పినాచ్ పప్పు లోను పడేస్తూనే ఉన్నా.. అయినా బస్తా అలాగే ఉంది. ఇంకా అది పని కాదనుకుని.. గ్రీన్ పులావ్ చేసేస్తే.. నోరెత్తకుండా (ఓన్లి తినడానికే తెరవడం) అవజేస్తారని గ్రీన్ పులావ్ చేసేద్దామని నిర్ణయానికి వచ్చా. చూస్తారా మరి..
రెండు గ్లాసులు.. సారీ.. కప్పులు బాసుమతి బియ్యం కడిగేసి పక్కన పెట్టుకోండి.
మసాలాలు..
౧.కప్పుడు కొత్తిమీర, కప్పుడు పుదీనా, రెండు పచ్చిమిర్చి మెత్తగా నూరాలి. అలాగే..
౨.కప్పుడు కొబ్బరి, ౩. కప్పుడు ఉల్లిపాయ ముక్కలు,౪. రెండు పెద్ద చెంచాలు అల్లం వెల్లుల్లి ముద్దా చేసేసుకోండి. ఒక పెద్దచేమ్చాడు ధనియా, చిన్న చేమచా జిర, నాలుగు లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, నాలుగు మిరియాలు, రెండు బిరియాని ఆకులు పొడి చేసుకోండి  . (నే నయితే ఇక్కడ దొరికే కర్రి పౌడర్ పెద్ద చెంచాడు వాడేశా.. అది.. సిక్రెట్..).
పెద్ద నాన్ స్టిక్కి (కోడలు అమెజాన్ లో టైటానియం కోటెడ్ వంట సామాన్లు కొంది.. ఎత్తడానికి చచ్చే  బరువైనా.. భలే ఉన్నాయి లెండి..) మూకుడు పొయ్యి మీద పెట్టి, పెద్ద గరిటెడు నూనె వేసి, పైన చెప్పిన వరుసలో అన్ని మసాలాలు వేస్తూ వేయించండి. ఈ లోగా పెద్ద బేసినుడు బ్రోకలి ముక్కలు మరీ పెద్ద కాక చిన్నా కాకుండా తరగండి. రెండు కప్పులు ఫ్రోజెన్ బఠానీలు, కావాలంటే ఒక కప్పు బీన్స్ ముక్కలు.. తయారు చేసుకుని.. వేగిన ముద్దలో వేసెయ్యండి. ఐదు నిముషాల్లో అంతా గ్రీన్ గా వేగుతూ ఉంటుంది. అవి వేగే లోపు నాలుగు కప్పులు నీళ్ళు మరిగించండి. ఆ నీళ్లు మూకుడులో వేసి, బియ్యం పోసి, తగినంత ఉప్పు.. (ఒక పెద్ద చెంచాడు వేసి చూడండి..) మూత పెట్టి, పావుగంట ఉడికిస్తే చాలు. గ్రీన్ రైస్ రెడి.. పైన సన్నగా తరిగిన జీడిపప్పు.. (నేను కలిపేశా.. లేకపోతె మొదటి వాళ్ళు పైనుంచి వేసుకునే  ప్రమాదముంది..) సన్నని రొమానో టమాటో ముక్కలు అలంకరించేస్తే చాలు.
పెరుగు పచ్చడితో పెట్టారంటే.. ఆరోగ్య కరమైన  సంపుర్ణాహారం ఊదేస్తారు .


Monday, June 13, 2011

అదిరేటి వంటలు. కాం ఇన్ అమెరికా

Posted by Mantha Bhanumathi on Monday, June 13, 2011 with 1 comment
బ్లాగర్ మిత్రులందరికి వందనాలు. చాలా రోజుల తరువాత పలుకరిస్తున్నందుకు మన్నించాలి.
పెద్ద మునిగిపోయే పనులేమి లేవు కానీ.. అమెరికా  రావడం, వచ్చాక పిల్లలతో కాలం గడపడం.. ఆ పైన కాసింత బద్ధకం.
సియాటల్ లో ఇప్పుడిప్పుడే వాతా వరణం బయట తిరగడానికి అనుకూలంగా అవుతోంది.
సాయంత్రం అలా వ్యాహ్యాళికి వెళ్లి, పార్కులో అందరితో కబుర్లు చెప్పి వస్తున్నాము.
అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేవరకు ఎప్పుడెప్పుడు వచ్చి పిల్లల్ని చూస్తామా అనిపిస్తుంది. వచ్చిన నెలకే తోచక ఎప్పుడేల్తామా అని రోజులు లెక్కపెట్టు కోవడం.. కనిపించనిదాని కోసం ప్రాకులాడడమే మానవ  స్వభావం.
బ్లాగ్ గురువు జ్యోతి గారి కాలం కి వంటలు రాసి పంపాలని ప్రయత్నం.. తమాషా ఏమిటంటే.. చేత్తో అటు ఇటు ఉప్పు కారం, మసాలాలు  విసిరేస్తే కుదిరే వంటలు.. కొలతలతో చేస్తే ఓ మాదిరిగా వస్తున్నాయి. ఏదో ఒకటి ఎక్కువో.. తక్కువో! 
ఇంకా బాగా ప్రయోగాలు చేసి పంపుతాను. అన్నట్లు ఇవేళ కారట్ రైస్ చేసాను.
రెండు పావులు బియ్యం మరీ ముద్దగా కాకుండా, మేకుల్లా కాకుండా వండి పెట్టుకోండి. అర్ధకిలో కారట్ తురిమి, రెండు ఉల్లిపాయలు, రెండంగుళాల అల్లం, ఆరు వెల్లుల్లి పాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు (సైజుని, మీ రుచిని పట్టి మార్చుకోవచ్చు..) సన్నగా.. అతి సన్నగా తరిగి ఉంచుకోవాలి. మూకుడు లేదా కళ్లాయి లేదా బాండిలో ఒక గరిట నూనె, రెండు చెంచాలు నెయ్యి వేసి, కాగాక, కారట్ తప్ప మిగిలినవి వేసి, అవి అదిరిపోయే వాసన వచ్చే వరకు వేయించి కారట్ తురుము వెయ్యాలి. అది మెత్తబడ్డాక అన్నం వేసి, ఉప్పు, పసుపు, కొంచెం వేయించిన వేరుసెనగ పొడి, మెత్తటి వేయించిన కొబ్బరి కోరు, వేయించిన ధనియా-జిర పొడి వేసి (కమాన్.. ఇవన్ని మీ రుచికి సరిపోయేట్లు అని వేరే చెప్పాలా..) బాగా కలిపి.. మూతపెట్టి, చిన్న మంట మీద ఉంచండి.
పదినిముషాలయ్యాక.. కొత్తిమీర కోరు, జీడిపప్పు ముక్కలు (వేయించి) చల్లండి.
అంతే.. కారట్ రైస్ రెడి.. దిన్ని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో తినచ్చు. లేదా నిమ్మకాయ పిండుకుని అలాగే లాగించేయ్యచ్చు.
బాగుందంటే చెప్పండి.. జ్యోతిగారి కాలం కి పంపుతాను. ఫోటో తియ్యలేదుస్మి.. బాగా వచ్చినట్లు ఎవరైనా చెప్తే అప్పుడు తీసి పంపుతా.